పేడతో కొట్టడమే సీమాంధ్ర సంస్కృతా?:ఈటెల

హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేయడాన్ని టీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ మహిళా ఉద్యోగులపై పేడతో కొట్టడమే సీమాంధ్ర సంస్కృతా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లను ఏనాడు తెలంగాణ వాళ్లు ఇబ్బందిపెట్టలేదని తెలిపారు. తెలంగాణలో వందలాది గుంటూరు పల్లెలున్నాయని పేర్కొన్నారు. అందరిని ఆదరించే గౌరవించే గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలదని స్పష్టం చేశారు. తెలంగాణలో సీమాంధ్ర మంత్రులను తాము కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని తెలిపారు. ‘మేం స్నేహ హస్తాన్ని అందిస్తున్నాం. సీమాంధ్ర నేతలు భస్మాసుర హస్తాన్ని చాటుతున్నారు’ అని విమర్శించారు.

పార్లమెంట్‌లో కూడా ఆంధ్రా అణచివేత: ఈటెల
భారత పార్లమెంట్‌లో కూడా తెలంగాణపై అణచివేత కొనసాగుతోందని ఈటెల విమర్శించారు. మొన్నటికి మొన్న రాజ్యసభలో బీజేపీ నేత వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. తెలంగాణ ఉద్యమానికి వర్తించిన నియమాలు, సీమాంధ్ర కృతిమ ఉద్యమానికి వర్తించవా అని ప్రశ్నించార

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.