పెత్తనం సాగకనే అరెస్టులు: కోదండరాం

హైదరాబాద్: సీమాంధ్ర నేతల పెత్తనం సాగకపోవడం వల్లే తెలంగాణలో అరెస్టుల పర్వానికి తెరతీశారని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తమ పెత్తనానికి అడ్డుతగులుతున్నారనే సీమాంధ్ర ప్రభుత్వం హింసకు దిగుతుందని, అరెస్టులు చేస్తోందని ఆయన ఆరోపించారు. సీమాంధ్రుల ఆధిపత్యం కూలిపోవాలంటే ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలను సమాయత్తం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని, ఉద్యమకారులను నిర్బంధించాలని చూస్తే ఉద్యమం మరింత బలపడుతుందని ఆయన తెలిపారు. మనం మన అనుభవాలను సమీక్షించుకుని భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసుకోవాలని కోదండరాం కోరారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.