పెత్తనం కేంద్రానిది.. ఖర్చు రాష్ట్రాలది

జలవనరులపై కేంద్రవూపభుత్వం పెత్తనం చేయనుంది. కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రవూపదేశ్ రెండు రాష్ట్రాల ప్రాజెక్ట్‌లు, నీటి వాటాల వివాదాలను కేంద్రం తన ఆజమాయిషీలోకి తీసుకుంటుంది. చిన్న తరహా నుంచి భారీ నీటి ప్రాజెక్ట్‌ల వరకు అన్నింటిలోనూ జోక్యం చేసుకోనుంది. ఇందుకోసం కేంద్ర జలవనరులశాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి మండలి ఏర్పాటు కానుందని, ఈ మండలికి పూర్తిస్థాయి అదికారాలుంటాయని ఆంధ్రవూపదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో స్ఫష్టంగా పేర్కొన్నారు. కేంద్ర జలమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ ఉన్నత మండలిలో ఆంధ్రవూపదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంవూతులు సభ్యులుగా ఉంటారు. గోదావరి, కృష్ణా నదీ జలాల కోసం కేంద్రం రెండు బోర్డులను నెలకొల్పనుంది. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, కృషా ్ణరివర్ మేనేజ్‌మెంట్ పేరిట ఈ బోర్డులు పనిచేస్తాయి.
గోదావరి బోర్డు కార్యాలయం తెలంగాణలో, కృష్ణా బోర్డు కార్యాలయం ఆంధ్రవూపదేశ్‌లో ఉంటుందని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. బోర్డుల పరిపాలన, నిర్వహణ, నిబంధనలను కేంద్రం ఎప్పటికప్పుడు నిర్దేశిస్తుండగా, వీటి పరిపాలనకయ్యే ఖర్చు మాత్రం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఈ రెండు బోర్డులపై కూడా కేంద్రం పెత్తనమే ఉంటుంది. ఆయా రాష్ట్రాల ఆజమాయిషీ లేకుండా రెండు బోర్డులకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తారు. కేంద్రం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలు అమలుచేస్తూ మార్గదర్శకాల ప్రకారం బోర్డులు పనిచేయాల్సి ఉంటుంది. బోర్డుల్లో ఎవవరు ఉండాలి, వారిని ఎవరు నియమించాలనే విషయాన్ని కూడా బిల్లులో స్పష్టం చేశారు. కేంద్రవూపభుత్వంలో సెక్రెటరీ లేదా అదనపు సెక్రెటరీ హోదాకు తక్కువ కాని అధికారిని చైర్‌పర్సన్‌గా నియమిస్తారు. ఒక్కో రాష్ట్రం ఇద్దరు సభ్యులను నియమించాలి. ఆ సభ్యులు చీఫ్ ఇంజినీర్ దిగువ ర్యాంక్ అధికారులై ఉండాలి.

దీంతోపాటు ఒక్కో బోర్డుకు పూర్తిస్థాయి మెంబర్ సెక్రెటరీని, రెండు బోర్డులకు కలిపి ఒక నిపుణుడిని కేంద్రం నియమిస్తుంది. సెంట్రల్ వాటర్ కమిషన్‌లో చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారులు మెంబర్ సెక్రెటరీలుగా పనిచేస్తారు. రిజర్వాయర్ల పరిస్థితిని రోజు వారీగా సమీక్షించడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సహకారం తీసుకుంటారు. ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం నీటి కేటాయింపులు జరుగుతున్నాయా? లేక దుర్వినియోగమవుతున్నాయా? జలవిద్యుత్ ఉత్పత్తి, సరఫరా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల అమలు నిబంధనల ప్రకారం జరుగుతుందా? జలవనరుల కేటాయింపుల ఆధారంగానే కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారా? అవి ఇతరుల ప్రయోజనాల దెబ్బతీసే విధంగా ఉన్నాయా? అనే విషయాలను బోర్డులు పర్యవేక్షిస్తాయి.

బోర్డు కార్యాలయాలకయ్యే ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు అవసరమైన సిబ్బందిని, నిధులను సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని, ఆజమాయిషీ మాత్రం కేంద్రానిదని బిల్లులో స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదులపై రాష్ట్రాలు చిన్న కుంటలు, కాల్వలు నిర్మించాలన్న కేంద్రం అనుమతి తప్పనిసరి. 1956 అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్‌లు ఇచ్చిన తీర్పులు సరిగా అమలవుతున్నాయో లేదో కూడా ఈ ఉన్నత మండలి చూసుకుంటుంది. నిజానికి ఉన్నత మండలిలో రెండు రాష్ట్రాల సీఎంలున్నా సుప్రీం పవర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రికే ఉంటుంది. దీంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంవూతుల్లో ఎవరు అభ్యంతరాలు చెప్పినా కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాల్లో తీవ్రజాప్యం జరిగే ప్రమాదం ఉంది.

మళ్లీ బ్రిజేష్ పంపకాలు
జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మళ్లీ తెరముందుకొస్తుంది. కృష్ణానదీ మిగులు, అధిక జలాల పంపిణీపై ఇప్పటికే తుదితీర్పునిచ్చిన బ్రిజేష్ ట్రిబ్యునల్ కాలపరిమతిని పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. బ్రిజేష్ కేటాయింపులు పూర్తయినా ఆంధ్రవూపదేశ్ విభజన క్రమంలో రెండు రాష్ట్రాల కోసం కనీసం రెండేళ్లపాటు ట్రిబ్యునల్‌ను మనుగడలో ఉంచబోతున్నారు. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునళ్ల తీర్పు ప్రకారం ఆంద్రవూపదేశ్‌కు 1005 టీఎంసీల నీటి వాటా దక్కింది. 294 టీఎంసీలను మిగులు జలాలు కేటాయించిన బ్రిజేష్ ట్రిబ్యునల్ లోయర్ రైపేరియన్ స్టేట్‌గా ఆంధ్రవూపదేశ్‌కు వరదజలాలను వాడుకునేందుకు స్వేచ్ఛ ఉందని, హక్కు లేదని చెప్పింది.

అంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్‌కు కేటాయించిన 2578 టీఎంసీలను మించి వరద వచ్చినప్పుడు ఆ నీటిని వాడుకోవచ్చనేది దానర్థం. కానీ ఇప్పడు ఆంధ్రవూపదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందున లోయర్ రైపేరియన్ రైట్స్‌పై సమీక్ష జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటు క్రమంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ తుదితీర్పు గెజిట్ పబ్లికేషన్‌ను కేంద్రం వాయిదావేసే అవకాశం ఉంది. ఆంధ్రవూపదేశ్ అభ్యంతరాల నేపథ్యంలో గెజిట్ పబ్లికేషన్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే గడువు మరికొన్ని రోజులలో ముగిసిపోనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రాజెక్ట్‌లకు నీటి కేటాయింపులు పూర్తయినందున పెద్దగా మార్పేమీ ఉండదని నిపుణులు అభివూపాయపడుతున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం పేరిట నీటి కేటాయింపులను గెజిట్‌లో ప్రచురించేందుకు వీలుగా బ్రిజేష్ ట్రిబ్యునల్ కాలపరిమితిని పొడిగిస్తున్నారు. తుంగభద్ర బోర్డులో కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌తోపాటు తెలంగాణను కూడా చేర్చనున్నారు. మహబూబ్‌నగర్‌లో ఆర్డీఎస్ ప్రాజెక్ట్ దీని పరిధిలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉన్నత మండలి ఎందుకు?
జలవాటాల పంపిణీకి ట్రిబ్యునళ్లు ఉండగా కేంద్రం అజమాయిషీలో మండలి ఏర్పాటు అవసరం లేదు. ఇప్పటికే కృష్ణాజలాల కేటాయింపులపై బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునళ్లు స్పష్టమైన తీర్పులిచ్చాయి. వాటిని అమలు చేస్తే చాలు.నికరజలాలతో పాటు మిగులు,అదనపు నీటివాటాల కేటాయింపులూ జరిగాయి. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి నియంవూతణ బోర్డు ఉంది. అవసరమైతే గోదావరి నదీజలాలను ఆంధ్ర, తెలంగాణ మధ్య పంపిణీకోసంకొత్తట్రిబ్యునల్‌నుఏర్పాటు చేసుకోవచ్చు.అంతేకాని ఉన్నతస్థాయి మండలి ఏర్పాటు వల్ల రెండు రాష్ట్రాలకూ ఇబ్బందే. ఒక సీఎం ఓకే అంటే ఇంకో సీఎం నో అనే పరిస్థితులుంటాయి. దీని వల్ల కొత్త ప్రాజెక్ట్‌లు ముందుకు సాగవు. గతంలో కొత్త రాష్ట్రాలకు లేని ఉన్నత మండలి తెలంగాణకే ఎందుకు వర్తింపజేస్తున్నారు? ఇంకా ఆంధ్ర ఆధిపత్యాన్ని కొనసాగించడానికేనా? తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ అంశాన్ని వ్యతిరేకించాలి.
-వీ ప్రకాశ్, జలరంగ విశ్లేషకులు

అనర్థం.. అపాయం
జలవనరులపై కేంద్రం పెత్తనం అనర్థాలకు దారితీస్తుంది. గోదావరి జలాలపై ప్రత్యేక బోర్డు అసమంజసం. గోదావరిలో దాదాపు 600 టీఎంసీలు తెలంగాణ వాటాగా ఉన్నాయి. కొత్తవూపాజెక్ట్‌లు నిర్మించుకోవడానికి అవకాశం ఉన్న కొత్త రాష్ట్రాన్ని బోర్డుల పరిధిలోకి తీసుకురావడం వల్ల మళ్లీ అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ఎలాంటి వివాదాలు లేని గోదావరిపై బోర్డులు అవసరంలేదని మొదటినుంచి చెప్తున్నాం.బోర్డుల ఏర్పాటు వల్ల లేని అడ్డంకులు, వివాదాలు సృష్టించినట్లే. కేంద్రం తన పెత్తనాన్ని వదులుకుని ట్రిబ్యునల్ తీర్పుల ప్రకారమే కేటాయింపులు జరిగేలా చూస్తే సరిపోతుంది. ఉన్నత మండలిని, గోదావరి రివర్‌బోర్డును మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ప్రజావూపతినిధులు దీనిని ప్రతిఘటించి తుది డ్రాఫ్ట్‌లో మార్పు చేసేలా చర్య తీసుకోవాలి. తెలంగాణ, ఆంధ్రవూపదేశ్ వాటాల పంపకం కోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ గడవును పెంచడాన్ని ఆహ్వానిస్తున్నాం.
– చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌డ్డి,
తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.

This entry was posted in ARTICLES.

Comments are closed.