పెత్తనం కూలాలి..దోపిడీ ఆగాలి-కోదండరాం

‘ఆంధ్ర పెత్తనం కూలాలి. దోపిడీ ఆగాలి. అన్యాయం కూలిపోవా లి. జై తెలంగాణ అంటేనే స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఉద్ఘాటించారు. సీమాంవూధలో సమైక్యవాదం పేరుతో చేస్తున్న ఆందోళనల వెనుక అసలు ఉద్దేశం ఆధిప త్యం, దోపిడీ కొనసాగింపేనని తేల్చిచెప్పారు. తెలంగాణ పోరా టం బతుకు పోరాటమని, న్యా యం, సమానత్వం, స్వాతంత్య్రం కోసం ఈ ఉద్యమం జరుగుతోందన్నారు. ఆత్మగౌరవంతో బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరూ రాష్ట్ర విభజనను కోరుతున్నారని, రాయలసీ మ, ఆంధ్రా ప్రాంతాల్లోనూ విభజనను కోరుకుంటున్నవారు ఉన్నారని తెలిపారు. రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అంటున్నారని, విభజనతో వచ్చే రెండుమూడు నష్టాలే చెబుతున్నారు కానీ.. కలిసుండటం వల్ల తెలంగాణకు కలిగే లాభాలేమిటో చెప్పడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రక్రియ ఆలస్యం అయిన కొద్దీ కుట్రలకు, విద్వేషాలకు అవకాశముందని, త్వరగా ఈ పని ముగించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆదివారం నిజాం కాలేజీ గ్రౌండ్‌లో టీ జేఏసీ నిర్వహించిన సకలజన భేరీ సభను ఉద్దేశించి కోదండరాం ప్రసంగించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘తెలంగాణలో సాగుకు అనువైన 52 లక్షల హెక్టార్ల భూమి ఉంది. కానీ ఇందులో 26లక్షల హెక్టార్లు మాత్రమే సాగవుతోంది.

వ్యవసాయానికి అనువైన సగం భూములు పడావులోనే ఉన్నాయి. ప్రపంచంలోనే యోగ్యమైన వ్యవసాయ భూములు పడావులో ఉన్నది ఒక్క తెలంగాణలోనే. సాగులో ఉన్న 26 లక్షల హెక్టార్లలో సగానికిపైగా భూముల్లో బోర్లు, చెరువుల కిందే వ్యవసాయం జరుగుతోంది. మన రైతులు బోర్ల కోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి వంద మందిలో 75మంది తెలంగాణవారే. మాది బతుకు పోరాటం. తెలంగాణ పోరాటం చేస్తున్నది నీళ్ల కోసం. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం. ఇక హైదరాబాద్‌లో మా పరిస్థితి ఏమిటని ఆంధ్రులు అడుగుతున్నారు. నిజానికి ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వలస వస్తున్నది 100లో 3.5శాతం మంది మాత్రమే. ఇక తెలంగాణ ప్రాంతానికి వలస వస్తోంది ఒక్కశాతమే. అలా వచ్చిన వారిలో మేస్త్రీ లు, కూలీలు ఎక్కువగా ఉన్నారు. వారితో మాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ చదువుకునే వారితో, వ్యాపారం చేసుకునే వారితోనూ ఇబ్బం ది లేదు. హైదరాబాద్‌లోని విద్యా సంస్థల్లో 85శాతం లోకల్, 15 శాతం నాన్‌లోకల్ కోటా ఉంటుంది కనుక వచ్చేవారు నాన్‌లోకల్ కోటాలోకి వెళ్లిపోతారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పౌరులకు హక్కులున్నాయి.

జగన్‌పై కేసుగానీ, చంద్రబాబుపై కేసులు గానీ చూస్తే సీమాంధ్ర నాయకుల వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలు సాగుతున్నాయన్నది అర్థమవుతోంది. రాయపాటి, లగడపాటి, కావూరి.. ఇలా ఎవరైనా తమ వ్యాపార ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. వారు ప్రజల మధ్య విద్వేషాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. విభజన ఇరు ప్రాంతాలకు మంచిది. నీళ్లు, ఉద్యోగాలు పెరుగుతాయి. విభజన వల్ల 97శాతం మంది వికాసం చెందుతారు. సీమాంధ్ర నాయకులు గతంలో తెలంగాణ రాష్ట్రం ప్రకటనను ఆపారు. ఇప్పుడు కూడా ఆపాలని చూస్తున్నారు. వారు ఆపినా తెలంగాణ తెచ్చుకునే శక్తి తెలంగాణకు ఉంది. తెలంగాణ బిల్లు పెట్టండి.. ఓట్లు వేస్తామని బీజేపీ పార్లమెంటరీ పక్ష నేత సుష్మాస్వరాజ్ చెప్పారు. ఇక, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు నోరు తెరుస్తలేరు. సీఎంను ఎదుర్కోవడం లేదు. ఇది మంచిది కాదు. మీ మౌనాన్ని తెలంగాణ సమాజం భరించదు. మా ఓర్పు, సహనాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. సీమాంవూధలోని శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు తమ విద్యార్థులను తీసుకుపోయి ‘జై సమైక్యాంధ్ర’ అనిపిస్తున్నారు. ఇక్కడ కూడా మీ కాలేజీలున్నాయి.

జాగ్రత్త! మీరు వ్యాపారం చేసుకునేదుంటే చేసుకోండి. మేం అడ్డుపడటంలేదు. కానీ ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ సమైక్యాంధ్ర అనడం సరైంది కాదు. ఇక మీడియాలోని ఒక వర్గం పక్షపాతం వహిస్తోంది. విలేకరులు మా తెలంగాణ బిడ్డలే. జర్నలిజం వృత్తిని, జర్నలిస్టులను కాపాడుకుంటాం. మీడియాలోని ఒక వర్గం ఆంధ్రా పాలకుల తొత్తుగా మారింది. ఆనాడు శ్రీశ్రీ అన్నాడు.. పెట్టుబడికి పుట్టిన విషపువూతికలు మీడియా అని. మీడియా రాజకీయ కుట్రలపై ప్రతిక్షికియ తప్పదు. జై తెలంగాణ అంటేనే స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం. తెలంగాణ ప్రక్రియ ముందుకుపోవడం లేదని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను కలిశాం. ప్రక్రియను ముందుకుపోయేందుకు ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రక్రియ ఆలస్యం అయిన కొద్దీ కుట్రలకు, విద్వేషాలకు అవకాశముంది. త్వరగా పని ముగించాలి’ అని కోదండరాం డిమాండ్ చేశారు. ‘ఆంవూధుల మీటింగ్ కోసం సీఎం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిండు. కానీ మేం ఇక్కడ ఏ సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ జరిగిన చిన్నచిన్న పొరపాట్లను మనసులో పెట్టుకోవద్దు. మళ్లీ ఉద్యమంలో ముందుకు సాగుదాం. జై తెలంగాణ’ అని నినదించారు.

డీజీపీ పీడ విరుగుడైంది: కోదండరాం
రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డికి పదవీ కాలాన్ని పొడగించేందుకు హైకోర్టు నిరాకరించడంపై తెలంగాణ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన సకల జన భేరీ సభ మధ్యలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం తెలంగాణ ప్రజలకు ఓ శుభవార్త అంటూ డీజీపీకి పదవీ కాలం పొడగింపుపై హైకోర్టు నిరాకరించిన విషయాన్ని వెల్లడి చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచిని డీజీపీ పీడ విరుగుడైంది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది’’ అని కోదండరాం ప్రకటించారు. దీంతో సభకు హాజరైన జనం చప్పట్లతో నిజాం కళాశాల మైదానం మార్మోగిపోయింది. సుమారు నాలుగైదు నిమిషాలపాటు చప్పట్లు, కేరింతలతో ప్రజలు హర్షామోదం వ్యక్తం చేశారు. డీజీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు.

సమైక్యం ముసుగులోపెట్టుబడిదారులు
వేళ్ల మీద లెక్కపెట్టే కొంతమంది పెట్టుబడిదారులు సమైక్యం ముసుగులో ఆందోళనలు నడిపిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న వందలాది ఎకరాలను కబ్జా చేసిన వారే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలోని దళిత వర్గాలవారు విభజన కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీఐఐసీ ద్వారా వందల ఎకరాలను సీమాంధ్ర బడాబాబులు కాజేశారని ఆరోపించారు. హైదరాబాద్‌ను విధ్వంసం చేసి అభివృద్ధి అంటున్నారని మండిపడ్డారు.

బంజారాహిల్స్‌లో లంబాడీలు లేరని, బతుకమ్మ కుంటలో కుంట మాయం చేశారని, పంజా గుట్టలో గుట్టను తవ్వి భవనాలు నిర్మించారని, పటాన్ చెరువులో చెరువు లేకుండా చేశారని చెబుతూ.. ఇదేనా అభివృద్ధి? అని ధ్వజమెత్తారు. సమైక్యం ముసుగులో దాడుల చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అయినా తెలంగాణ ప్రజలు ఓపికతో ఉంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు దాడులకు దిగాలనుకుంటే ఒక గంట చాలని, కానీ ఆ మార్గం ఎంచుకోవడం లేదని స్పష్టం చేశారు. విద్యార్థి నాయకుడు బాలరాజ్, కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై దాడిచేసినా సంయమనం పాటించామన్నారు. ఉద్యమనాయకులు కేసీఆర్, కోదండరాంలను కూడా అవమానించారని, తెలంగాణకు మద్దతు తెలిపిన సీపీఐ కార్యాలయాలపై దాడులకు దిగారని గుర్తు చేశారు. అయినా సహనంతో ముందుకెళ్తున్నానమని చెప్పారు. సీమాంవూధనేతల కుట్రలు బయటపెడతామని హెచ్చరించారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజలను అవమానపరుస్తున్న రాజకీయ నేతలు ఏ ప్రాంతంవారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

సీఎం రాజీనామా చేయాలి:మల్లెపల్లి లక్ష్మయ్య
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణ యం సీఎం కిరణ్‌కుమార్‌డ్డికి నచ్చకపోతే వెం టనే ఆయన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ జేఏసీ కో చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రాజీనామా తర్వాత సమైక్య ఉద్యమానికి ప్రత్యక్షంగా చైర్మన్‌గా వ్యవహరించినా ఫర్వాలేదన్నారు. కానీ ఇరు ప్రాంతాలకు సీఎంగా కొనసాగుతూ ఒక ప్రాంతం కొమ్ముకాస్తానంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర నేతలకు వాటిల్లే నష్టమేమిటో చెప్పాలని నిలదీస్తే సమాధానం చెప్పే పరిస్థితిలో లేరన్నారు. అలాంటి ఉద్యమాన్ని సీఎం భుజానెత్తుకొని నడిపిస్తున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోతేనే సీమాంధ్ర ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందుతారని అన్నారు. అందుకే సీమాంవూధలో ఆయా వర్గాల ప్రజలు అక్కడి ఆందోళనల్లో పాల్గొనడం లేదన్నారు. ప్రత్యేకంగా ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేసి తెలంగాణ నీళ్లు, నిధులు కొల్లగొట్టుకుపోయారని చెప్పారు.

బడ్జెట్ కొల్లగొట్టి ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నదే కాకుండా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాయలసీమ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణాల్లో 4 విమానాక్షిశయాలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. తెలంగాణలో ఒక్క విమానాక్షిశయం ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి సాధించినట్లా? అని ప్రశ్నించారు. సీమాంవూధలో ఏడాదికి మూడు పంటలు తీస్తుంటే తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక వ్యవసాయం వదిలి బొంబాయి, దుబాయి వలసలు పోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామనడంలో వాస్తవం లేదన్నారు. బిల్డింగుల్లో ఆంధ్రులు, గుడిసెల్లో తెలంగాణవాదులుండడమే అభివృద్ధా? అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉన్న ఆర్ట్స్ కాలేజీ, గాంధీ ఆస్పత్రి, చార్మినార్, అసెంబ్లీ వంటి భవనాలను ఎవరు కట్టించారని ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తొందరపడి హడావుడి నిర్ణయం తీసుకోలేదన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. అమరుల త్యాగాల బాటలో తెలంగాణ ఉద్యమం పని చేస్తుందని చెప్పారు. ఇది భూమి కోసం, భుక్తి కోసం, అడవి హక్కుల కోసం జరుగుతున్న న్యాయబద్దమైన ఉద్యమమని లక్ష్మయ్య అన్నారు.

10 నిమిషాలు కూడా కలిసి ఉండలేని పరిస్థితి
ఏపీ ఎన్జీవోలు చేస్తున్న ఉద్యమంపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీవూపసా ద్ డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవోలు ఎందుకు సమ్మె చేస్తున్నారో కూడా చెప్పలేని స్ధితిలో ఉన్నారని అన్నారు. ఉద్యోగా ల్లో అన్యాయం జరుగుతుందా? బదిలీల్లో మో సం జరుగుతుందా? పెన్షన్లు రావనే అనుమానాలున్నాయా? అంటే చెప్పలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగులు సకల జనుల సమ్మెకు దిగితే ప్రభుత్వం పట్టించుకోకపోగా.. రాజవూదోహం కేసులు పెట్టిందన్నారు. ఒక్కొక్కరిపై వం దల కేసులు పెట్టి ఉద్యమాన్ని అణగదొక్కే యత్నం చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లో 68వేల మంది ఉద్యోస్తులుంటే కేవలం 3 నుంచి 4వేల మంది ఉద్యోగులు మాత్రమే సమ్మెలో పాల్గొంటున్నారన్నారు. సీఎం మాత్రం వేల సంఖ్యలో ఉద్యమంలో పాల్గొంటున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పడితే లక్షా 45వేల మంది ఉద్యోగులు ఎక్కడికెళ్లాలని సీఎం మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నదన్నారు. హైదరాబాద్‌లో సుమారు 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యం వహిస్తే పౌర సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు. ఇంత వివక్ష తర్వాత కూడా సీమాంధ్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కలిసి ఉంచే ప్రయత్నిస్తే మూర్ఖత్వమే అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను 10 నిమిషాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉంచేందుకు ప్రయత్నించినా విఫలమవుతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలిస్తామని కేసీఆర్ ప్రకటిస్తే తప్పుపట్టడం సరైంది కాదన్నారు. జూలై 30న తెలంగాణపై ప్రకటన చేసిన కాంగ్రెస్.. పార్లమెంటులో బిల్లు పెట్టకుండా ఆలస్యం చేయడం వల్లే సుమారు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.