‘పూల’ పీఠం-విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం: పూల రవీందర్

తెలంగాణవాదం ముందు సమైక్యవాదం ఓడింది. యూటీఎఫ్, ఏపీ టీచర్స్ అభ్యర్థులకు కనీస ఓట్లు కూడా రాలేదు.
తెలంగాణ అభ్యర్థికే ‘పూల’ పీఠం దక్కింది.. మండలి పదవి రవీందర్‌ను వరించింది. అన్నిరౌండ్లలో ఆధిక్యం లభించినా.. చివరి వరకు ఉత్కం తప్పలేదు. బరిలో ఆరుగురు అభ్యర్థులు.. నలుగురు ఎలిమినేషన్.. ఇద్దరి మధ్య పోరు.. మొదటి ప్రాధాన్యంలో రాని మ్యాజిక్ ఫిగర్.. రెండో ప్రాధాన్య ఓటే కీలకంగా మారింది.. చివరికి పీఆర్‌టీయూ అభ్యర్థి పైచేయి సాధించారు.. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీఆర్‌టీయూ అభ్యర్థి పూల రవీందర్ విజయం సాధించారు. నల్లగొండ జిల్లాకు చెందిన పూల రవీందర్.. రెండో ప్రాధాన్య ఓటుతో వరంగల్ జిల్లాకు చెందిన ఎనగందుల వరదాడ్డిపై విజయం సాధించారు.

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 20,441 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 18,481 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోలైన ఓట్లలో 342 చెల్లకుండా పోయాయి. దీంతో 18,139 ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకున్నారు. మొత్తం ఓట్లలో 50శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలనే నిబంధన ఉండడంతో.. 9070 సంఖ్యను మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది. మొదటి ప్రాధాన్యంలో మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓటును పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం పోటీలో ఆరుగురు అభ్యర్థులుండగా.. నలుగురు అభ్యర్థులు ఎలిమినేషన్ అయితేగానీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మొదటి ప్రాధాన్యం ఓట్లలో పీఆర్‌టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కు 6765ఓట్లు, 11తెలంగాణ ఉపాధాయ సంఘాలు బలపరిచిన ఎనగందుల వరదాడ్డి 4761ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి నాగటి నారాయణకు 4527ఓట్లు, ఏపీటీఎఫ్ అభ్యర్థి బద్దం అశోక్‌డ్డికి 1538 ఓట్లు, ఆపస్ అభ్యర్థి కూతురు లకా్ష్మడ్డికి 368 ఓట్లు, భాషోపాధ్యాయ సంఘం అభ్యర్థి ఎలగందుల లక్ష్మికి 180ఓట్లు మాత్రమే లభించాయి.

తొలి ప్రాధాన్యత ఓటు విషయానికొస్తే.. తొలిరౌండులో 1 7వేల ఓట్లను లెక్కలోకి తీసుకోగా.. వరదాడ్డికి 1749ఓట్లు, నారాయణకు 1796ఓట్లు, పూల రవీందర్ 2558ఓట్లు, అశోక్‌డ్డి 589ఓట్లు, కూతురు లకా్ష్మడ్డికి 133, వై.లక్ష్మికి 57 ఓట్లు లభించాయి. ఇందులో117ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండో రౌండులో 14 వరదాడ్డికి 1821, నారాయణకు 1681, రవీందర్‌కు 2583, అశోక్‌డ్డికి 566, లకా్ష్మడ్డికి 137, లక్ష్మి 77ఓట్లు వచ్చాయి. మరో 135 ఓట్లు చెల్లలేదు. మూడో రౌండులో వరదాడ్డికి 1191, నారాయణకు 1050, రవీందర్‌కు 1624, అశోక్‌డ్డికి 383, లకా్ష్మడ్డికి 98, వై.లక్ష్మికి 46 ఓట్లురాగా.. 90ఓట్లు చెల్లలేదు.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి 50శాతం ఓట్లు రాలేదు. దీంతో అభ్యర్థులకు వచ్చిన తొలి ప్రాధాన్యత ఓట్లను ఆధారంగా చేసుకుని.. అందులోని రెండో ప్రాధాన్య ఓటును పరిగణలోకి తీసుకున్నారు. అందరి కంటే తక్కువగా వచ్చిన ఎలగందుల లక్ష్మి (ఆరోస్థానం)ని ఎలిమినేషన్ చేశారు. ఆమెకు తొలి ప్రాధాన్యంలో 180 ఓట్లురాగా.. అందులో మిగతా అయిదుగురు అభ్యర్థులకు రెండో ప్రాధాన్యం ఓట్లు లెక్కించారు. మొత్తం 180 ఓట్లలో 34 ఓట్లు వరదాడ్డికి, 52 ఓట్లు నాగటి నారాయణకు, 38 ఓట్లు పూల రవీందర్‌కు, 25ఓట్లు అశోక్‌డ్డికి, 16 ఓట్లు లకా్ష్మడ్డికి లభించగా.. 15 ఓట్లు లెక్కలోకి రాలేదు/చెల్లలేదు. ఈ రౌండు పూర్తయ్యాక మొత్తం కలిపి వరదాడ్డికి 4795, నారాయణకు 4579, రవీందర్‌కు 6803, అశోక్‌డ్డికి 1563, లకా్ష్మడ్డికి 384ఓట్లు వచ్చాయి. 50శాతం ఓట్లు ఎవరికి రాకపోవడంతో ఐదో స్థానంలో ఉన్న లకా్ష్మడ్డిని రెండో ఎలిమినేషన్ చేయగా.. ఆయనకు వచ్చిన 368 ఓట్లలో వరదాడ్డికి 85, నారాయణకు 64, రవీందర్‌కు 156, అశోక్‌డ్డికి 36 ఓట్లురాగా.. 43 ఓట్లు చెల్లలేదు. ఈ రౌండు పూర్తయ్యాక మొత్తం కలిపి వరదాడ్డికి 4880, నారాయణకు 4643, రవీందర్‌కు 6959, అశోక్‌డ్డికి 1599ఓట్లు వచ్చాయి.

అయినా మ్యాజిక్ ఫిగర్ 9070 రాకపోవడంతో నాలుగో స్థానంలో ఉన్న అశోక్‌డ్డిని మూడో ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది. ఆయనకు వచ్చిన 1538 ఓట్లలో వరదాడ్డికి 360, నారాయణకు 411, రవీందర్‌కు 508 ఓట్లు లభించగా.. 320ఓట్లు చెల్లలేదు. అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 9070ఓట్లు ఎవరికి రాలేదు. ఈ రౌండు పూర్తయ్యాక మొత్తం కలిపి వరదాడ్డికి 5240 ఓట్లు, నారాయణకు 5054 ఓట్లు, పూల రవీందర్‌కు 7467ఓట్లు ఉన్నాయి. అప్పటికీ 50శాతం ఓట్ల కోటాకు ఎవరూ చేరకపోవడంతో మూడో స్థానంలోని నారాయణను ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది. నాగటి నారాయణకు తొలి ప్రాధాన్యంలో వచ్చిన 4527ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ ఓట్లలో 1042ఓట్లు వరదాడ్డికి, 1672ఓట్లు పూల రవీందర్‌కు లభించగా.. 2340ఓట్లు చెల్లలేదు. ఈ రౌండు పూర్తయ్యాక (నారాయణ ఎలిమినేషన్ తర్వాత) రవీందర్‌కు మొత్తం ఓట్లు 9139రాగా.. ఎనగందుల వరదాడ్డికి 6282ఓట్లు వచ్చాయి. మొత్తం 2718 ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండో ప్రాధాన్యం ఓటులో నలుగురు అభ్యర్థులు ఎలిమినేషన్ అయితేగానీ.. మ్యాజిక్ ఫిగర్ 9070 రాలేదు. ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగిలారు. పూల రవీందర్‌కు 9139ఓట్లు లభించగా.. వరదాడ్డి కంటే 2857ఓట్ల ఆధిక్యత లభించింది.

తొలి, రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆద్యంతం పూల రవీందర్‌కే ఆధిక్యత లభించింది. ఆఖరి రౌండు వరకు వరదాడ్డి గట్టిపోటీ ఇచ్చినా.. చివరికి విజయం మాత్రం పూల రవీందర్‌నే వరించింది. మూడు జిల్లాల్లో సంఘం బలంగా ఉండడం, టీటీజేఏసీ చైర్మన్‌గా పని చేయడం, సకల జనుల సమ్మెలో ఆయన పాత్ర కీలకంగా ఉండడం, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రెండున్నర దశాబ్దాలుగా పూల రవీందర్ ముందుండడంతో విజయం సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ తెలంగాణలో బలంగా ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి నాగటి నారయణ మూడో స్థానంలో నిలిచి చివరికి ఎలిమినేషన్ అయ్యారు. సమైక్య సంఘాల నుంచి విడిపోయి ఏర్పడిన 11తెలంగాణ ఐక్య సంఘాల మద్దతు వరదాడ్డి బరిలో దిగగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రత్యేకంగా సంఘ పరంగా పూర్తి స్థాయిలో ఓటు బ్యాంకు లేకపోగా.. తెలంగాణ వాదంపైనే ఓట్లు పడినట్లు తెలుస్తోంది.

తెలంగాణ అమరవీరులకు విజయం అంకితం: పూల రవీందర్
తెలంగాణ అమరవీరులకు తన విజయాన్ని అంకితం చేస్తున్నానని.. తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తానని పూల రవీందర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకే గెలిపించారని.. భవిష్యత్తులో వారికిచ్చిన హామీలు, సమస్యల సాధనకు కృషి చేస్తానన్నారు. ఈ విజయంలో తెలంగాణవాదం కీలక పాత్ర పోషించిందని.. తెలంగాణ రాష్ట్ర సాధనకు చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.