పూలె ఆశయసాధనకు కృషి చేయాలి: ఈటెల

విద్యతోనే అభివృద్ధి సాధ్యమని.. సమాజ రుగ్మతల నిర్మూలనకు అదే ఆయుధమని మహాత్మా జ్యోతిబా ఫులె ఏనాడో చెప్పాడని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఫులే ఆశయాల సాధన కోసం యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫులె జయంతి ఉత్సవాలను బీసీ విద్యార్థి సంఘాల సమన్వయ సమితి మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజేందర్ మాట్లాడుతూ.. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా, కేవలం 5.5 శాతం మాత్రమే అమలువుతున్నట్లు నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. బీసీలు ఏ బాధ్యతల్లో ఉన్నా.. వర్గ ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని సూచించారు. ఆకలి లేని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్నారు. బండారు దత్తావూతేయ మాట్లాడుతూ తాత్కాలిక అంశాలపై కాకుండా దీర్ఘకాలిక అంశాలపై ఫులె పనిచేశారని అన్నారు. కార్యక్షికమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఓయూ వీసీ ఎస్ సత్యనారాయణ, బీజేపీ నేత లక్ష్మణ్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, ఉద్యోగ జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, తెలంగాణ ఉద్యమ నాయకురాలు విమలక్క, జర్నలిస్టులు పల్లె రవికుమార్, పరంధాములు, ప్రొఫెసర్లు సుదర్శన్, ఉమేష్, రామకృష్ణయ్య, మృణాళిని, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, విద్యార్థి నేతలు చిరుమళ్ల రాకేష్, కోట శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, దయాకర్, మధుసూదన్ పాల్గొన్నారు. కార్యక్షికమాన్ని బీసీ విద్యార్థి సంఘాల నేతలు బీసీ నర్సన్న, రామారావుగౌడ్, సాంబశివగౌడ్, శంకర్, దత్తాత్రి తదితరులు సమన్వయం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.