పులికేసిలు.. కేసీఆర్ అన్నదేంటో ముందు తెలుసుకోండి!

(పోరుతెలంగాణ శ్రీనివాస్):  సీఎం కిరణ్, బొత్స ఇప్పుడే లేచి.. అధర్మమధర్మమని అరుస్తున్నరు. నాయనా పులికేసిలు కేసీఆర్ ప్రధానిని అన్నదేంటి? అన్నదాంట్లో తప్పేంటి? పార్లమెంట్ లో చప్రాసికి ఉన్న సోయి ప్రధానికి లేదన్నడు. ఈ ముచ్చట ఢిల్లీల అన్నడు. ఒక్కసారి కాదు వందసార్లన్నడు. ఇన్నిరోజులు మీ సోయి ఎటుపోయింది పులికేసిలు.

ఇక మీ నెహ్రూ బలవంతంగా తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలుపలేదా? తెలంగాణను నిండా ముంచలేదా? ఒక ప్రాంతానికి అన్యాయం చేసినోడు గొప్పనాయకుడెట్ల అవుతడు బొత్స. ద్రోహం చేసినోడు ఏ స్థాయిలో ఉంటే ఏంటి? ఈయనను విమర్శించడానికి స్థాయి కావాలా? మిస్టర్ కిరణ్ కేసి? నువ్వు వట్టి నామినేటెడ్ సీఎంవు. కేసీఆర్ స్థాయి గురించి మాట్లాడే స్థాయి నీకున్నదా నామినేటెడ్ సీఎం. నీకు ఓ సంస్కారం.. రీతినీతి ఉన్నదా? అవును కేసీఆర్ సబ్ రీజనల్ పార్టీ లీడరే. ఆయనకున్న ఫాలోయింగ్ నీకున్నదా? ఆయన అట్టిట్యూడ్ మార్చుకోవాలా? ఆయన అట్టిట్యూడ్ మార్చుకుని శాంతిజపం వీడితే మీకుంటది.. దేత్తడే

ఇక  మీ ఇందిరాగాంధీ 1969లో ముక్కుపచ్చలారని 10 ఏల్ల తెలంగాణ బిడ్డలను నిర్ధాక్షిణ్యంగా చంపలేదా? కాసు బ్రహ్మానందరెడ్డితో చేతులు కలిపి 369 మందిని పొట్టనపెట్టుకోలేదా? మీకసలు చరిత్ర తెలుసా కిరణ్ కేశి, బొత్స సత్తి? ఇందిరాగాంధీ దేశం కోసం చావలె. సిక్కుమతాన్ని పూర్తిగా అవమానపరిచి సచ్చింది. రాజీవ్ గాంధీ కూడా తమిళులను నాశనం చేసి.. తానూ నాశనమైండు. వీళ్లిద్దరూ దేశం కోసం చావలేదు.

ఇక ఇటలీ బొమ్మ సోనియమ్మ. బర్త్ డే గిప్ట్ అని తెలంగాణ ఇచ్చింది. మళ్ల ఏం పుట్టిందని వెనక్కి తీసుకున్నది. వెయ్యిమంది తెలంగాణఫ బిడ్డలను చంపింది సోనియాగాంధీకాదా? తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెడుతున్నది నిజం కాదా? ఈమేం త్యాగశీలి.. అధికారం విషం లాంటిదన్నదట కదా ఈమె. యూపీఏ చైర్ పర్సన్ రాజీనామా చేయొచ్చు. రాహుల్ ను మూలకు కూర్చోబెట్టొచ్చు కదా? ఆయనకెందుకు విషపు పదవి. బొత్స నీకు మూడు పదవులు.. నీ పెళ్లానికో పదవి.. నీ తమ్మునికో పదవి ఉన్నది. అధికారం విషమన్నోడివి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ పదవులకు రిజైన్ చేయండి

ఓ… నిన్నటిసంది..  కాంగ్రెస్ నేతలంతా బట్టలు చింపుకుంటున్నరు.

 

 

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.