పీవీ జయంతిని ఎందుకు జరుపరు?: హరీష్‌రావు

హైదరాబాద్: సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ దివంగత నాయకుల పట్ల ఒకనీతి, సీమాంధ్ర దివంగత నేతల పట్ల ఒకనీతిని అవలంభిస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత మాజీ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి జయంతి ఉత్సవాలను అధికారికంగా జరుపుతోన్న సీమాంధ్ర ప్రభుత్వం మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు జయంతిని ఎందుకు అధికారికంగా నిర్వహించదని ఆయన ప్రశ్నించారు. పీవీ తెలంగాణ వాడైనందుకేనే ఈ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కినందుకేనా నీలం సంజీవరెడ్డి జయంతుత్సవాలు జరుపుతాన్నరని అన్నారు. ఎన్టీర్ విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేసినపుడు పీవీ విగ్రహాన్ని పార్లమెంట్‌లో పెట్టేందుకు అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. పీవీ తెలంగాణ వడైనందుకేనా ఈ వివక్ష అని దుయ్యబట్టారు. ఇంకా ‘తెలంగాణ నేతలు కార్మిక నేత టంగూటూరి అంజయ్యను ఎందుకు పట్టించుకోరు. మర్రి చెన్నారెడ్డికి ఎందుకు నివాళులర్పించరు’ అని ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.