పీఎస్‌ఎల్వీ ప్రయోగం సక్సెస్

 

sl – వినువీధిలో ఇస్రోకు మరో ఘనవిజయం
– కక్ష్యలోకి చేరిన తొలి నావిగేషన్ ఉపక్షిగహం
– పీఎస్‌ఎల్వీకి వరుసగా 23వ విజయం
– ఆనందంలో మునిగిపోయిన శాస్త్రవేత్తలు;జతూలయ?
నిప్పులు చిమ్ముతూ.. నిశీథిని చీల్చుకుంటూ పీఎస్‌ఎల్వీ రాకెట్ మరోసారి అంతరిక్షంలో ఘనవిజయాన్ని నమోదుచేసింది. భారత అంతరిక్ష సంస్థ (ఇవూసో)కు మరో చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది. ఇస్రో విజయాశ్వమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ సి-22) సోమవారం రాత్రి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. భారత మొట్టమొదటి నావిగేషన్ ఉపక్షిగహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రూ. 1,600కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ఉపక్షిగహం.. భూతల, ఆకాశ, వాయు మార్గాలలో భద్రత, నావిగేషన్ సేవలను అందించనుంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో రాత్రి 11.41 గంటలకు పీఎల్‌ఎల్వీ ప్రయోగం జరిగింది.

P-2నిర్దేశిత మార్గంలో 20.25 నిమిషాలపాటు ప్రయాణించి.. నాలుగు దశలను విజయవంతంగా దాటుకుంటూ పీఎస్‌ఎల్వీ రాకెట్.. నావిగేషన్ ఉపక్షిగహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 44.5 మీటర్ల పొడవు ఉన్న పీఎస్‌ఎల్వీ సీ-22 రాకెట్‌ను ఎక్సెల్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ఇది నాలుగు దశల్లో ప్రయాణించి 285 కిలోమీటర్ల పెరూజీ, 20,650 కి.మీ. అపోజీ పరిధిలోని జియో ట్రాన్స్‌పర్ ఆర్బిట్‌లో 17.8 డిగ్రీల వాలులో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉపక్షిగహాన్ని ప్రవేశపెట్టింది. శ్రీహరికోట నుంచి అర్ధరాత్రి వేళ ఉపక్షిగహ ప్రయోగం చేయడం ఇదే ప్రథమం. దాదాపు 20 నిమిషాలపాటు రాకెట్ గమనాన్ని ఉత్కం వీక్షించిన ఇస్రో శాస్త్రవేత్తలు.. పీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతంకాగానే ఆనందంలో మునిగిపోయారు. చప్పట్లు కొడుతూ హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, ప్రముఖ శాస్త్రవేత్త యశ్‌పాల్ షార్‌లో ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. పీఎస్‌ఎల్వీకి ఇది వరుగా 23వ విజయం. ఈ ప్రయోగం అనంతరం మాట్లాడిన ఇస్రో చైర్మన్ కే రాధాకృష్ణన్ పీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించారు.

ఇంకా పది నేవిగేషన్ ఉపక్షిగహాలను ప్రయోగిస్తామని తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించి 64.30 గంటల కౌంట్‌డౌన్ శనివారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. కౌంట్‌డౌన్ ముగిసిన అనంతరం నిర్దేశిత సమయానికి రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ)లోని ఈ ఉపక్షిగహం వాహనాలు, నౌకలు, విమానాల గమనాన్ని కచ్చితంగా సమాచారాన్ని అందించనుంది. ప్రకృతిదీనివల్ల భారత్ చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలో కచ్చితమైన నేవిగేషన్ సమాచారం తెలుసుకునేందుకు వీలవనుంది. ఈ ఉపక్షిగహం పది సంవత్సరాలకుపైగా సేవలు అందిస్తుంది.
– ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ రెండు రకాల సేవలు అందిస్తుంది. సాధారణ ప్రజల వినియోగానికి సంబంధించి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ (ఎస్‌పీఎస్) కాగా, మరోటి రిస్ట్రిక్టెడ్ సర్వీస్ దీనిని సైన్యం వినియోగించుకోనుంది. భూ, జల, వాయు మార్గాలలో స్థితి, స్థాన దిక్కులకు సంబంధించిన రవాణా వాహనాలు, వాహన చోదకులకు దిశానిర్దేశక సేవలు చేయనుంది. విపత్తు సమయాల్లో వాయిస్, విజువల్ నేవిగేషన్ సేవలందించడం, వాహనాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం, వాహనాల కాన్వాయ్ నిర్వహణ వంటి సేవలందిస్తుంది.
– పూర్తి స్వదేశీ నావిగేషన్ ఉపక్షిగహ వ్యవస్థ (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ మొదటి ఉపక్షిగహం. దీంతోపాటు మరో 6 ఉపక్షిగహాలను ప్రయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటన్నింటినీ అనుసంధానం చేస్తేనే దేశవ్యాప్తంగా నావిగేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
– ఈ ఉపక్షిగహ ప్రయోగంతో ప్రపంచంలో నావిగేషన్ ఉపక్షిగహాలు కలిగిన అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల సరసన భారత్ చేరనుంది.
– ఈ ప్రాజెక్టుకు ఇస్రో 1,600కోట్లు ఖర్చు చేసింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ బరువు 1425

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.