పాలమూరు బిడ్డపై పాశవిక దాడి

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిపై కర్ణాటకలో గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. కోలార్‌లోని దేవరాజ మెడికల్ కళాశాలతోలో వైద్యవిద్య అభ్యసిస్తున్న కామేశ్వర సాయిప్రసాద్‌శర్మపై మంగళవారం సాయం త్రం దాడికి పాల్పడిన దుండగులు అతని మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని, అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సాయిప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన కామేశ్ దేవరాజ వైద్య కళాశాలలో మెడిసిన్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం గ్రంథాలయానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంటల బాధకు తాళలేక కామేష్ కేక లు వేస్తూ తాను అద్దెకుంటున్న ఇంటి వద్దకు పరుగెత్తటంతో చుట్టుపక్కలవారు మంటలు ఆర్పారు. అతడికి కోలార్‌లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. కామేశ్ తండ్రి లక్ష్మణశర్మ కల్వకుర్తి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. కుమారుడిపై దాడివార్త తెలియగానే ఆయన తన కుటుంబంతో కలిసి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. కామేశ్ శరీరం 60శాతం కాలిపోయిందని,

ముఖ్యమైన అవయవాలు వైద్యానికి పూర్తిస్థాయిలో స్పందించకపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అవయవాలు వైద్యానికి సహకరించేందుకు బుధవారం సాయంత్రం వైద్యులు డయాలసిస్ ప్రారంభించారని తెలిపారు. కామేశ్‌కు చదువే లోకమని, ఎవరితోనూ గొడవలు పడేవాడుకాదని అతని స్నేహితులు చెబుతున్నారు. వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు చాలామంది ఉన్నారని, తెలంగాణతో పాటు సీమాంధ్రకు చెందిన వాళ్లు కూడా ఉన్నారనే విషయం తమ కుమారుడు పలు సందర్భాల్లో చెప్పాడని లక్ష్మణశర్మ తెలిపారు. రాష్ట్ర విభజనపై తెలంగాణ,

13mbr-02a సీమాంధ్ర విద్యార్థులకు వాదోపవాదాలు జరిగేవని చెప్పేవాడని పేర్కొన్నారు. ఏం జరిగిందో ఏమో కాని తమ బిడ్డపై పాశవికంగా దాడి చేశారని ఆయన కన్నీళ్లపర్యంతమయ్యారు. దాడి విషయం తెలిసిన వెంటనే టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాలాజీసింగ్ బుధవారం సాయంత్రం బెంగళూర్ వెళ్లారు. దాడిపై రకరకాల వార్తలు ప్రచారం కావటంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. టీఆర్‌ఎస్వీ, టీజీవీపీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.