పాలమూరు ప్రజాగర్జనకు సుష్మాస్వరాజ్

హైదరాబాద్ : వచ్చేనెల 2న మహబూబ్‌నగర్‌లో జరిగే పాలమూరు ప్రజాగర్జన సభకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై ప్రజల్లో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు తన నేతృత్వంలో మూడు ప్రాంతాల నుంచి మూడు బృందాలతో ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలవనున్నట్లు ఆయన చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.