పార్లమెంట్‌లో బిల్లు పాసయ్యేంత వరకు కాంగ్రెస్‌ను నమ్మొద్దు-కేసీఆర్

telangana
-తెలంగాణ బిల్లు పెట్టి ఊరుకుంటారు..
-మహిళాబిల్లు సంగతి చూశాం.. దళిత రిజర్వేషన్‌బిల్లు పెండింగ్‌లోనే
-తెలంగాణ ఇవ్వకుంటే మీ ఇళ్లముందు ఎవరూ ఉండరు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్
-బానిసల చేతిలో తెలంగాణ పెట్టం.. పునఃనిర్మాణంలోనూ టీఆర్‌ఎస్
-లక్షమంది రాధాకృష్ణలొచ్చినా వెంట్రుక పీకలేరని హెచ్చరిక

‘తెలంగాణపై కాంగ్రెస్ అనేక డెడ్‌లైన్లు పెట్టింది. షిండే 30 రోజుల డెడ్‌లైన్ పెట్టారు. కానీ అజాద్ వారం అంటే ఏడురోజులేనా.. నెలంటే 30 రోజులేనా అన్నాడు. ఇవి ప్రపంచంలోనే లేని మాటలు. కళ్లారా చూసిన చరిత్ర. కాంగ్రెస్‌ను నమ్మొద్దు. తెలంగాణ సమాజం గుడ్డిగా విశ్వసించొద్దు. తెలంగాణ ఇచ్చినా చెయ్యిమీద గిచ్చుకునే పరిస్థితి ఉంది. సీడబ్ల్యూసీలో తీర్మానం, పార్లమెంట్‌లో బిల్లు పెట్టడమే చేస్తారు. అయినా నమ్మొదు. బిల్లు పాస్ అయితేనే నమ్ముతాం. బిల్లు పాస్‌కాకముందు చేసేవి మాయామశ్చీంద్ర మోసాలు. మహిళాబిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఆమోదం కాలేదు. మాయావతి కోరిన దళితులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందిగానీ, లోక్‌సభలో ఇంకా నానుతూనే ఉంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కార్యక్షికమంలో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వేణుగోపాలాచారికి గులాబీ కండువాను కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ‘కాంక్షిగెస్ నయానాటకానికి తెరతీసింది. కోర్ కమిటీలో నిర్ణయం అన్నారు. ఇప్పుడు సీడబ్ల్యూసీ అంటున్నారు. అక్కడ కూడా నిర్ణయం రాదట. సోనియాగాంధీకి నిర్ణయం అప్పగిస్తూ తీర్మానం చేస్తారట. 1956నుండి నిరంతరం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు జబర్దస్తు చేసి విలీనం చేసుకున్నారు. 1969 ఉద్యమాన్ని జైళ్లపాలు చేసి ఆపారు. 13సంవత్సరాల నేటి ఉద్యమంలో బలిదానాలు, త్యాగాలు, పోరాటాలు..’ అని ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రపంచంలోనే సకలజనుల సమ్మెలాంటి ఉద్యమం రాలేదని కేసీఆర్ చెప్పారు. ‘2009లో సస్తే సచ్చిన అనుకుని అమరణ దీక్షకు దిగితే తెలంగాణ ప్రకటన చేశారు. ఆ సంతోషం 24గంటలు కూడా లేకుండా సీమాంవూధులు రాజీనామాలు చేశారు’ అని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్ ఇంటికాడ ఎవరూ ఉండరని కాంగ్రెస్ ఎంపీ వీ హన్మంతరావు అంటున్నారని, తెలంగాణ ఇవ్వకపోతే మీ నాయకుల ఇళ్లముందు ఎవరుంటారని ఎదురుదాడి చేశారు.

పునఃనిర్మాణంలోనూ మనమే
తెలంగాణ వచ్చిన తరువాత పునఃనిర్మాణంలో కూడా టీఆర్‌ఎస్ ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. బానిసలను తెలంగాణ సమాజం నమ్మదని, బానిసల చేతిలో తెలంగాణను పెట్టబోమని చెప్పారు. టీఆర్‌ఎస్ ఉంటేనే తెలంగాణ సమాజానికి ఎంతో మంచిదని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు పోరాడుదామని, తెలంగాణ సాధించుకుని, ఆత్మగౌరవంతో బతుకుదామని కేసీఆర్ చెప్పారు. ఆంధ్ర మీడియా ఆగమాగం చేస్తోందని, కేసీఆర్‌ను తగ్గించి చూపించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఇప్పుడు ఏం చేసినా ఆగదని, కథ అంతా అయిపోయిందని చెప్పారు.

1996లో అదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో శ్రీరాంసాగర్‌ను చూశానని, ఆ ప్రాజెక్టు దయనీయ స్థితి చూసి ఎక్కడైతే అరాచకం, దోపిడీ, అన్యాయం జరుగుతుందో అక్కడ 100శాతం తిరుగుబాటు వచ్చి తీరుతుందని చెప్పినట్లు గుర్తుచేశారు. అప్పుడు నాయకత్వలేమీ వల్ల ఉధృతమైన తెలంగాణ ఉద్యమం రాలేదని, 2000సంవత్సరంలో చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా చార్జీలు పెంచుతుండటంతో తనే ఉద్యమాన్ని మొదలు పెట్టానని చెప్పారు. ఇప్పుడు ఆ ఉద్యమం మహావూపభంజనమైందని, ఇప్పుడు ఉద్యమాన్ని ఆపే పరిస్థితి లేదని. ‘ఆరునూరైనా తెలంగాణ వచ్చి తీరుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అద్భుత చైతన్యంతో, స్ఫూర్తితో సాగుతోంది. ఈ ఉద్యమానికి కులం లేదు, మతం లేదు. అన్ని వర్గాలు చొరవ చూపి, మా రాష్ట్రం మాకు కావాలని కోరుకుంటున్నారు. అదిలాబాద్ జిల్లాలో 49శాతం అడవులున్నాయి.

తెలంగాణలో కాశ్మీర్‌లాంటి జిల్లా అదిలాబాద్. ప్రకృతి జలపాతాలున్నాయి. మిగిలిన శాతంలో 34శాతం వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మేఘాలయలోని చిరపుంజిలో కురిసే వర్షపాతం అదిలాబాద్ జిల్లాలో కురుస్తుంది. కడెం ప్రాజెక్టు వారం రోజుల నుండి పొంగిపొర్లుతోంది. అయినా సరే ఈ జిల్లాకు ఇంకా నీటి కోసం ఆవేదన, బాధ మాత్రం తీరలేదు. ప్రకృతిని దేవుడిచ్చాడు. కానీ ఈ మనుషులు, వలసాంధ్ర పాలకుల శాపం వల్లే అదిలాబాద్‌కు ఈ దుస్థితి’ అని అన్నారు. తాను 2002లో అదిలాబాద్ జిల్లా కౌటాలకు వెళ్లిన సందర్భంలో ఒక గ్రామంలో మంచి బట్టలేసుకున్న వ్యక్తి కారు ఆపితే వెళ్లి జెండా ఎగరేశానని, ఆయన కారు మరోపక్కకు తీసుకెళ్లి ‘గదే పెన్‌గంగ నది, ఇది నా ఎండిపోయిన పొలం’ అని చూపించాడని తెలిపారు. ఆనాడే ఒక రైతుకు అర్థమైందని, ఇదే తీరులో ఎన్నడూ రాజకీయ పార్టీల సభలకు రాని గోండులు కూడా జెండాలు ఎగురవేయించి నీళ్ల సమస్యలు చెప్పారని అన్నారు.

లక్షమంది రాధాకృష్ణలొచ్చినా వెంట్రుక పీకలేరు
ఆంధ్రజ్యోతి పేపరు టీఆర్‌ఎస్‌పై ఏదో ప్రేమ ఉన్నట్లుగా వార్తలు రాస్తోందని, రాధాకృష్ణకు శాపాలు పెట్టే శక్తి ఉంటే కేసీఆర్‌ను రాయిగానో, బండగానో మార్చేస్తామంటున్నారని మండిపడ్డారు. రాధాకృష్ణ కాదుకదా… లక్షమంది రాధాకృష్ణలొచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు అని హెచ్చరించారు. పిచ్చికూతలు, రాతలు మానుకోవాలని, అవసరమైతే తెలంగాణ సమాజం ఆంధ్రజ్యోతిని బహిష్కరించేలా చూస్తామని చెప్పారు. ‘నేను హిమాలయమంత ఎత్తైన నాయకుడిని. శృతి మించితే ఎవరూ చేతులు ముడుచుకుని లేరు. నేను ఏకాకినా? నాతో వస్తావా? ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం! లక్షమంది వచ్చినా నా వెంట్రుక కూడా పీక్కోలేరు’ అని దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రజల విజయం: కేకే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల విజయమని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఉద్యమించాడు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందని అన్నారు. ఎవరో తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం లేదని, మొత్తం తెలంగాణ సమాజం సాధించిన విజయం వల్లే రాష్ట్రం ఏర్పాటు కాబోతోందని చెప్పారు. ఏ పార్టీ వల్ల తెలంగాణ రాలేదని, ప్రజల వల్లే వచ్చిందని చెప్పారు. అమరవీరుల రక్తం తాగిన మనుషులు ఉన్నారని, ఇంకా వారి చేతులకు రక్తం మరకలు అంటుకునే ఉన్నాయని టీ కాంగ్రెస్ నేతలపై కేకే మండిపడ్డారు. అమరవీరుల శవాలమీద ప్రమాణాలు చేసిన వారు ఉన్నారని అన్నారు. ఇక దేవుడు కూడా తెలంగాణను ఆపలేరని స్పష్టం చేశారు. ఎంపీలను జైల్లో పెట్టిన వారే ఇప్పుడు పిలిచి తెలంగాణపై మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆయనకు ఇచ్చిన కేంద్ర మంత్రి పదవిని తన కళ్లముందే ప్రధాని సమక్షంలో వదిలేశారని చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాలచారి మాట్లాడుతూ ఢిల్లీ నాయకులు స్వీట్లు పంచారు, టీలు ఇచ్చారుగానీ తెలంగాణ మాత్రం తేల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30సంవత్సరాల పాటు టీడీపీలో ఉండి ఆ పార్టీ రెండుకళ్ల సిద్ధాంతం నచ్చక బయటకొచ్చానని చెప్పారు.

మొదటిలేఖకు కట్టుబడి ఉన్నామని మళ్లీ లేఖ రాశారని, ఆ లేఖ ఇచ్చిన తరువాతే ఉల్లంఘనలు జరిగాయని చెప్పారు. కేవలం తెలంగాణే ఎజెండాగా ఉన్న పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని, టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యమని అందరూ నమ్ముతున్నారని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తానని, కాంగ్రెస్, టీడీపీని బొందపెట్టి తెలంగాణ తెచ్చుకుందామని చెప్పారు. కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన రహముల్లాఖాన్ మాట్లాడుతూ జగన్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి సీమాంవూధవారని, కేవలం కేసీఆర్ మాత్రమే తెలంగాణ బిడ్డ అని చెప్పారు. కేంద్రంలో ఉన్న దిగ్విజయ్, షిండే, చిదంబరం అందరూ దొంగలేనని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.