పార్లమెంటు భద్రతకు ఏం చేద్దాం?

-భద్రతా కమిటీ అత్యవసర సమీక్షకు స్పీకర్ ఆదేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పార్లమెంటులో సీమాంధ్ర సభ్యులు గురువారం చేసిన దాడుల వంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు స్పీకర్ మీరాకుమార్ సోమవారం పార్లమెంటు భద్రతా కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు భవనం భద్రత కోసం ప్రస్తుతం తీసుకొంటున్న చర్యలన్నింటినీ పరిశీలించి, భవిష్యత్తులో చేపట్టాల్సిన అదనపు చర్యలపై సూచనలు చేయాలని డిఫ్యూటీ స్పీకర్ కరియాముండా నేతృత్వంలోని ఈ కమిటీ స్పీకర్ ఆదేశించారు. లగడపాటి రాజగోపాల్ గురువారం సభలో చల్లిన పెప్పర్ స్ప్రే వంటి పదార్థాలు, మారణాయుధాలు సభలోకి సభ్యులే తీసుకురాకుండా ముందస్తు చర్యలు చేపట్టే అంశాలను కూడా కమిటీ పరిశీలించనుందని లోక్‌సభ సచివాలయం శుక్రవారం పేర్కొంది.
meerakumar అయితే, పార్లమెంటు భద్రత కోసం ఎలాంటి అంశాలను పరిశీలిస్తున్నారనే విషయాన్ని వివరించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్లమెంటులతోకి వెళ్లే సందర్శకుల మాదిరిగానే ఇకనుంచి ఎంపీలను కూడా పూర్తిగా సోదా చేసిన తర్వాతే లోపలికి అనుమతించేలా నిబంధనలు మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. సభలో తమ తఢాకా చూపిస్తామని సీమాంధ్ర ఎంపీలు ముందే ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం వారిని భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేకపోయారని పార్లమెంటు అధికారులు భావిస్తున్నారు. భద్రతా నిబంధనలు అడ్డుపెట్టుకొని సీమాంధ్ర ఎంపీలు మారణాయుధాలను సభలోకి తెచ్చారని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలను నిరోధించాలంటే సభ్యులను కూడా సోదా చేయాల్సి ఉంటుందని అభివూపాయపడుతున్నట్లు తెలిసింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.