పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి: ఆర్ కష్ణయ్య

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక శాఖ, రూ.20 వేలకోట్లతోసబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలని అన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేనిఫెస్టోల్లో బీసీల వాటా ప్రకటించకుంటే తగిన బుద్ధి చెబుతామని పార్టీలను హెచ్చరించారు.

rckrishaihవిద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు ఆధార్‌ను లింక్ ఉపసంహరించకుంటే మండల, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.