పార్టీలకు మీడియా సేవ: హరీశ్‌రావు

సీమాంధ్ర మీడియా ప్రజల పక్షాన కాకుండా పార్టీలకోసం పనిచేస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉపనేత తన్నీరు హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా మల్లారంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 13 ఎంపీ స్థానాలు గెలుస్తుందన్న టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వేకు సీమాంధ్ర మీడియా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్, చంద్రబాబుకు, జగన్‌కు అనుకూలంగా సర్వేలు వచ్చినప్పుడు నానా హంగామా చేశాయన్నారు. తెలంగాణ అంటే ద్వేషభావం ఎందుకని ప్రశ్నించారు. యాజమాన్యాలకు ధైర్యం ఉంటే తెలంగాణ వార్తలు రాయబోమని నేరుగా ప్రకటించాలన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.