పాపపరిహారం చేసుకోవడానికే టీఆర్‌ఎస్‌లోకి:కడియం

స్టేషన్‌ఘన్‌పూర్ : సీమాంధ్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేకే తాను ఆ పార్టీని వీడానని టీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి తెలిపారు. పాపపరిహారం చేసుకోవడానికే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని కడియం స్ఫష్టం చేశారు. ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తర్వాత సొంత ఇంటికి వచ్చినట్లుందని, నా నిర్ణయాన్ని ప్రజలు పూర్తిగా స్వాగతిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని కడియం అన్నారు. సీమాంధ్ర పార్టీలు తెలంగాణకు అడ్డుకోవడాన్ని కళ్లారా చూశానని, అయినా టీడీపీలో ఉన్నన్నాళ్లు ఏమీ చేయలేని పరిస్థితి అని, అందుకే ఆ అచేతన స్థితినుంచి బయటపడ్డానని కడియం అన్నారు. 5 దశాబ్దాలుగా జరుగుతున్న ఉద్యమంలో వెయ్యి మందికి పైగా తెలంగాణ బిడ్డలు చనిపోయారని, పార్టీ మారిన తర్వత కొంత మంది తనపై ఎంతో నీచంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, మహానాడులో చంద్రబాబు చేత తెలంగాణపై తీర్మానం పెట్టించ లేకపోయారన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.