పాన్ కార్డు కావాలంటే..ఆధార్ కార్డు తప్పనిసరి!

ఆధార్ కార్డును ప్రతిఒక్కరూ పొందేలా కేంద్రప్రభుత్వం మరింత కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నగదు బదిలీ, ఉపకారవేతనలు వంటి అనేక పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఇక నుంచి పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డు కావాలంటే ఆధార్ కార్డు ఉండాలన్న నిబంధనలు కూడా ముందుకు తీసుకురానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధార్ కార్డులో ఉన్న చిరునామా, వివరాల ఆధారంగా పాన్ కార్డును జారీ చేయనున్నారు. ఆదాయపు పన్నుశాఖకు ఉద్యోగులు, ఇతరులు డాక్యుమెంట్లు సమర్పించేటప్పుడు పాన్ కార్డు ఉండాల్సిందే. అయితే, కొందరు తప్పుడు పాన్ కార్డులను సృష్టించి,వాటితో ఐటీ నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు పాన్ కార్డులకు అడ్డుకట్టవేయాలంటే ఆధార్ ఆధారంగానే పాన్ కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.