పాక్-ఇరాన్ సరిహద్దుల్లో భూకంపం:100 మంది మృతి

టెహ్రాన్: పాకిస్థాన్ – ఇరాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ ఇరాన్‌లో భూప్రకంపనల కారణంగా భారీ నష్టం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఇరాన్‌లో వంద మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.8గా నమోదైనట్టు అమెరికా జియాలజికల్ సర్వే తెలిపింది. పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దులోని కాస్ ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. భూఉపరి తలానికి పదిహేను కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపారు. ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని ముల్తాన్, దక్షిణ ఎమిరేట్స్‌లలో కూడా భూమి కంపించింది. ఇంకా దుబాయ్, షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో కూడా భూకంపం చోటుచేసుకుంది.


This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.