పవార్‌ను కలిసిన ముంబై టీ జేఏసీ

ముంబయి: సడక్ బంద్ సందర్భంగా అక్రమ అరెస్టులను ఖండించాలని కోరుతు ఎన్సీపీ నేత శరాద్‌పవార్‌ను ముంబై తెలంగాణ జేఏసీ సభ్యులు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను రెండో తరగతి పౌరులుగా చూస్తూ తెలంగాణ ఇవ్వమన్నందుకు అక్రమ కేసులు బనాయించారని పవార్‌కు జేఏసీ నాయకుల తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తేయించాని వారు డిమాండ్ చేశారు. దీనికి పవార్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.