పవన్‌పై కేసు నమోదుకు మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం

నిజామాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని కామారెడ్డి ఎన్నికల బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసిన పవన్‌పై 163/ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని నిజామాబాద్ రెండవ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు డిచ్‌పల్లి పోలీసులను ఆదేశించింది.
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.