పరువు గంగపాలు

VH-డెహ్రాడూన్‌లో కాంగ్రెస్, టీడీపీ బురద రాజకీయం
-విమానాశ్రయంలో ఉభయ పార్టీల ఎంపీల తోపులాట
– బాధితులను తరలించడంలో ఘర్షణ
– పోటాపోటీగా సర్కారు, టీడీపీ విమానాలు
– విపత్కాలంలోనూ రాజకీయాలా?
-ఈసడించుకున్న వరద బాధితులు
– పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
– టీడీపీ విమానంలో 105మంది.. సర్కారు విమానంలో 116 మంది
– హైదరాబాద్‌కు చేరుకున్న బాధితులు

ఊరుకాని ఊరు.. రాష్ట్రం కాని రాష్ట్రం. ఐదారు రోజులపాటు.. కొండకోనల్లో అష్టకష్టాలు పడిన వరద బాధితుల ముందు! అయినా బేషరమ్! ఇక్కడ రాజకీయమే ముఖ్యం. బాధితులను మా విమానంలో తరలిస్తామంటే… కాదు.. మా విమానంలోనే పంపిస్తామంటూ! అధికార కాంగ్రెస్ నేతలు.. ప్రతిపక్ష టీడీపీ నేతలు వాదులాడుకున్నారు. అది ముదిరి.. తోపులాటకుదిగారు. తాము విపత్తును ఎదుర్కొంటున్న రాష్ట్రంలో.. ఎయిర్‌పోర్టులో ఉన్నామని మర్చిపోయి.. మీడియా సమక్షంలో.. వరద బాధితులు చూస్తుండగానే.. దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. పరస్పర దూషణలతో ఎయిర్‌పోర్టును హోరెత్తించారు.

ఎంపీల రగడతో కాసేపు డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు స్థానిక పోలీసులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కానీ.. ఆ పాటికే రాష్ట్రం పరువు గంగపాలైంది. కలిసికట్టుగా బాధితులను ఆదుకోవాల్సిన సమయంలో పోటాపోటీ రాజకీయాలేంటని బాధితులు ఈసడించుకున్నారు. టీవీల్లో ఈ దృశ్యాలు చూసిన రాష్ట్ర ప్రజలు.. బురద రాజకీయాలతో కంపుకొట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఉత్తరాఖండ్ వరద బాధితుల్లో రాష్ట్రానికి చెందినవారిని స్వస్థలాలు పంపేందుకు ఇప్పటిదాకా రైళ్లను ఉపయోగించిన రాష్ట్ర ప్రభుత్వం.. టీడీపీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో తానూ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. డెహ్రాడూన్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నది. మరోవైపు టీడీపీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నది. టీడీపీ ఎంపీ రమేశ్ రాథోడ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలీకాప్టర్‌లో బద్రీనాథ్ నుంచి బాధితులను డెహ్రాడూన్‌కు తీసుకునివచ్చారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చిన హెలికాప్టర్లను సీరియల్ ప్రకారం ఎయిర్‌పోర్టు అధికారులు అనుమతించారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు హెలికాప్టర్లు మూడు ట్రిప్పుల్లో బద్రీనాథ్ నుంచి యాత్రికులను తీసుకొచ్చాయి. కాంగ్రెస్ నేతలు కేంద్రమంత్రి బలరాంనాయక్, ఎంపీ వీ హన్మంతరావు, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్‌డ్డి తదితరులు కూడా డెహ్రడూన్‌లో సహాయ కార్యక్షికమాలను పర్యవేక్షిస్తున్నారు.

బుధవారం సాయంవూతానికి డెహ్రడూన్ నుంచి 200కుపైగా యాత్రికులు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తంకుమార్‌డ్డి, రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావు ఉన్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎంపీలు రమేష్‌రాథోడ్, సత్యనారాయణ తమ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బాధితులను తరలించేందుకు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన విమానం డెహ్రాడూన్ విమానాక్షిశయానికి వచ్చిన సమయంలో ఈ గొడవ ప్రారంభమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

babu వారి కథనం ప్రకారం.. కాంగ్రెస్ నేతలు ఇస్తున్న బోర్డింగ్ పాసులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని అక్కడే ఉన్న ఎంపీ హన్మంతరావు టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ‘తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంవూతిగా ఉన్నారు.. ఇది మీ లెవల్? ప్రభుత్వం చేపడుతోన్న సహాయ కార్యక్షికమాలను అడ్డగించడం సమంజసం కాదు’ అని అన్నారు. ఈ సమయంలో టీడీపీ ఎంపీలు జోక్యం చేసుకొని, బాధితులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారున్నారని, ఈ పరిస్థితుల్లో కేవలం హైదరాబాద్‌కే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం సరికాదని, తాము విశాఖపట్నం వరకూ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినందున అటు వెళ్లేవారిని తమ విమానంలో తీసుకు పట్టుపట్టారు. బాధితులను తాము నేరుగా హైదరాబాద్‌కు పంపిస్తామంటే అడ్డుకోవడం మంచిది కాదని, బాధితులను విమానం ఎక్కనివ్వాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌డ్డి టీడీపీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణతో అన్నారు.

దీంతో ఎంపీ సత్యనారాయణ తాము మొదటినుంచి బాధితులకు సహాయం చేస్తున్నామని, టీడీపీ చేస్తున్న పనికి పోటీగా మీరు వచ్చారని మంత్రిని ఉద్దేశించి అనడంతో అక్కడే ఉన్న వీహెచ్ జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం చేసే సహాయ కార్యక్షికమాలకు చేయూత నివ్వాలి కానీ విమానం ఎక్కవద్దని అనడం మంచిది కాదని అన్నారు. తెలుగు బాధితులను కాంగ్రెస్ నేతలు బస్సు ఎక్కిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించగా, బాధితులను తాము విమానంలోకి ఎక్కిస్తుండగా టీడీపీ నేతలు తీసుకు తమ విమానంలో ఎక్కాలని బలవంతం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రమేష్‌రాథోడ్, సత్యనారాయణలు, వీహెచ్‌తో ఈ విషయంలో వాగ్యుద్ధానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితి తలెత్తింది. వాదన ముదిరి.. పరస్పరం తోపులాటకు దిగారు. దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని, వారిని దూరంగా పంపించాల్సి వచ్చింది. ఈ వివాదం అంతా చంద్రబాబు సమక్షంలో జరగడం గమనార్హం.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.