పరభాష ఆమె వద్దట-పరాయి ప్రాంతంలో వాళ్లు మాత్రం తిష్టవేస్తరట

పరభాష వ్యక్తి సెన్సార్‌ బోర్డ్‌ చైర్మన్‌ అయితేనే సీమాంధ్ర సినిమావాళ్లు ఒప్పుకుంటలేరు. కేవలం మూడు సంవత్సరాల కాల పరిమితి ఉండే పోస్టును తమిళ మహిళకు ఇస్తే సీమాంధ్ర ఇండస్ట్రీ  తట్టుకుంటలేదు. ధనలక్ష్మికి భాషరాదు. తీసెయ్యాలి. ఒక్క తమిళ వ్యక్తిని తీయించలేకపోతున్నమని తెలుగు నిర్మాతలు, దర్శకులు గుండెలు బాదుకుంటున్నరు.  ధనలక్ష్మిని సెన్సార్‌ బోర్డ్‌ చైర్మన్‌గా వెంటనే తొలగించకుంటే సినిమాలు తీయలేమని అల్టిమేటం ఇస్తమని అంటున్నరు. అసలు తెలుగు భాష రాని ధనలక్ష్మి తాట తియ్యాలె అని నిర్మాత, దర్శకుడు తేజ నోరుపారేసుకున్నడు. సినీ నిర్మాతలు, దర్శకులంతా ధనలక్ష్మిని పక్కకుపెట్టాలని పట్టుబడుతున్నరు. అలాంటిది పరాయి ప్రాంతంలో తిష్టవేసి తెలంగాణ భూములను సీమాంధ్ర సినిమావాళ్లు కొట్టేస్తే మేమెట్ల ఊరుకుంటం.

అరేయ్‌ ఒక్క తమిళ మహిళకు పదవి ఇస్తేనే తట్టుకోలేకపోతున్నరు. తొలగించాలని పట్టుబడుతున్నరు. ఏండ్లకు ఏండ్లుగా మీ సీమాంధ్ర పెత్తందార్లు మా తెలంగాణను ఏలుతున్నరు. ముఖ్యమంత్రులు, మంత్రులై మా భూములను బుక్కపెట్టిన్రు. మా ఉద్యోగాలను కొల్లగొట్టిన్రు. మా నీళ్లను ఆంధ్రాకు మలుపుకున్నరు. సినిమాలో కట్ లకే మీరింత ఫీలితే మా జీవితాలనే కట్ చేస్తున్న సీమాంధ్ర పాలకుల మీద మేమెట్ల ఫైర్‌ కావాలె. ధనలక్ష్మిని మీ ఆస్తిని కొల్లగొట్టలేదు. మీ ఉద్యోగాలను తీసుకోలేదు. అయినా ధనలక్ష్మికి భాష తెలియదు, తెలియదని అంటున్నరు. ఆమెను తొలగించాలంటున్నరు. మీకు మా సంస్కృతి, సాంప్రదాయలు తెలియవు. మా కట్టుబాట్లు తెలియవు. పైగా మా ఆస్తులను కొల్లగొడుతున్నరు. మేం మీతోటి ఎందుకు కలిసుండాలి. ఇది మాత్రం ఆలోచించరు. అందుకే ఆంధ్రులు అల్పులు. బల్పెక్కువ మెదడు తక్కువ. తెలంగాణీయులు మోసపోవడమెక్కువ. ఎదురుతిరగడం తక్కువ. ఇంక ఆంధ్రుల ఆటలు సాగవులే. తెలంగాణ మేలుకొన్నది. తెగతెంపుల ఖేల్‌కు సిద్ధమంటున్నది.

 

 

 

 

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.