పభుత్వం దొంగలకు సద్దికట్టోద్దు : నరేందర్ రావు

హైదరాబాద్ : సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ దొంగలకు సద్దికడుతోందని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేయాల్సిన పని కాదని సచివాలయ సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత నరేందర్‌రావు అన్నారు. సచివాలయంలో విధులకు హాజరైన వారిని సీమాంధ్ర నేతలు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులు ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారని నరేందర్‌రావు విమర్శించారు. తమకు పని చేసే వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తొలి అడుగుగా సచివాలయంలో జూనియర్ ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సచివాలయ టీఎన్జీవో నేత నరేందర్ రావు తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.