పదేళ్లు ఉమ్మడి రాజధాని ఒప్పుకోం

హైదరాబాద్‌ను సీమాంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా మాత్రమే అంగీకరించాలని, పదేళ్లు ఉమ్మడి రాజధాని అంటే అంగీకరించవద్దని, హైదరాబాద్‌పై ఏ కుట్రలు జరిగినా పోరాటానికి సిద్ధపడాల్సి ఉంటుందని టీ జేఏసీ అభివూపాయపడింది. పోలవరం డిజైన్ మార్చు కోవాల్సిందేనని టీ జేఏసీ స్పష్టం చేసింది.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రైతులకు విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఎన్టీపీసీ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతానికి నాలుగువేల మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. సింగరేణి బొగ్గును దోచుకునేందుకు సీమాంధ్ర కుటిల యత్నాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని, ఈ కుట్రలను నేలమట్టం చేసేవరకు విశ్రమించేది లేదని జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్ శాంతిభవూదతలు, భూపరిపాలన, మహానగర పరిపాలన తదితర అంశాలను రాజ్యాంగాధికరణం 258-ఏ పేరుతో కేంద్రానికి దఖలు చేసేందుకు సీమాంధ్ర మంత్రులు లాబీయింగ్ చేస్తున్నారని, ఈ లాబీయింగ్‌ను సహించే ప్రసక్తిలేదని జేఏసీ తేల్చిచెప్పింది. రాష్ట్ర జాబితాకు సంబంధించిన ఏ చిన్న అంశాన్ని కూడా కేంద్రానికి దఖలు చేసేందుకు ససేమిరా అంగీకరించేది లేదని జేఏసీ వ్యాఖ్యానించింది. గురువారం రెండో రోజు కూడా జేఏసీ విస్తృతస్థాయి స్టీరింగ్ కమిటీ భేటీ జరిగింది.
శుక్రవారం మరోసారి భేటీ అయి వివిధ అంశాలపై నివేదికలకు తుది రూపం ఇచ్చి మంత్రుల బృందానికి పంపించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌పై మల్లేపల్లి లక్ష్మయ్య వివరణాత్మక నివేదిక రూపొందించారు. విద్యుత్తు, వనరుల పంపిణీపై రిటైర్డ్ ఐఏఎస్ గోయల్, విభజన సందర్భంలో పరిశీలించాల్సిన పరిపాలనా అంశాలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామలక్ష్మణ్ మాట్లాడారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.