టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజైన నవంబర్ 29వ తేదీన ఇందిరాపార్క్‌లో పది వేల మందితో దీక్షా దివస్ కార్యక్షికమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడుశ్రవణ్ తెలిపారు.
బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్‌పై సన్నాహక సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకఘట్టమైన కేసీఆర్ దీక్ష చేసిన రోజును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని కేకే పిలుపునిచ్చారు.