పది మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

హైదరాబాద్: శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన పది మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఇవాళ్టితో గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి ప్రతిస్థానానికి ఒక అభ్యర్థే పోటీలో ఉన్నందున వాళ్లంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు శాసనమండలి అధికారులు ప్రకటించారు.

గెలుపొందిన పార్టీల వివరాలు:
కాంగ్రెస్- 10 ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొందింది. టీడీపీ- 3, టీఆర్‌ఎస్, వైఎస్సార్సీపీలు చెరొక స్థానాన్ని దక్కించుకున్నాయి. గెలుపొందిన అభ్యర్థులకు అసెంబ్లీ కార్యదర్శి సదారాం ధృవీకరణ పత్రాలను అందజేశారు. ధృవీకరణ పత్రాలను స్వీకరించిన వారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మహబూబ్‌ఆలీతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్‌ఆలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వీర భద్రస్వామి, లక్ష్మీ శివకుమారి, సంతోష్‌కుమార్, టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, సలీం, శమంతకమణి, వైఎస్సార్పీసీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.