పదివేల మంది దుర్మరణం

 

సునామీ తరహా అలలు.. కనికరంలేకుండా వీచిన ప్రచండ గాలులు.. ఏకమై విరుచుకుపడిన ప్రకృతి పెనుబీభత్సంలో ఫిలిప్పీన్స్ చిగురుటాకులా వణికిపోయింది. తీర ప్రాంత పట్టణాలు, నగరాలను తుడిచిపెడుతూ పంజా విసిరిన సూపర్ టైఫూన్ (భారీ తుఫాన్ ) హైయాన్ ధాటికి కనీవినీ ఎరుగనిస్థాయిలో ప్రాణనష్టం జరిగింది. తుఫాన్ ధాటికి 10వేలకు పైచిలుకు మరణించి ఉంటారని ఫిలిప్పీన్స్ అధికారులు ఆదివారం అంచనా వేశారు.

p2phil2
అనేక ద్వీపాల సమూహమైన ఫిలిప్పీన్స్ చరివూతలోనే అతి శక్తిమంతమైన ఈ తుఫాన్ ధాటికి భీతిగొలిపేరీతిలో ప్రాణనష్టం జరుగగా..
p2phil5 మరోవైపు ప్రకృతి విలయంలో సర్వం కోల్పోయి దీనావస్థలో మిగిలిన బాధితులకు ఇంకా సహాయం అందకపోవడంతో బాధిత ప్రాంతాలలో పరిస్థితి హృదయాన్ని కలిచివేసేవిధంగా కనిపిస్తోంది. బంధువులను కోల్పోయి..సాయమందక అలమటిస్తున్న బాధితుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న లెతీ ప్రావిన్సు రాజధాని టక్లోబాన్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆకలి కేకలతో అలమటిస్తున్న బాధితులు వ్యాపార సముదాయాలు, మాల్స్‌లలో చొరబడి దోపిడీకి పాల్పడుతున్నారు. టక్లోబాన్‌లో దోపిడీ ఆగడాలను నియంవూతించేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించినట్టు నగర పోలీసులు ప్రకటించారు. ఇక ప్రకృతి పెనువిపత్తులో సహకరించాల్సిందిగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఆ దేశానికి మిలిటరీ సాయం అందించేందుకు ముందుకొచ్చింది. మరోవైపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తోంది.

టక్లోబన్‌లో మిన్నంటిన ఆకలికేకలు
‘టక్లోబన్ పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబసభ్యులను కోల్పోయి.. ఆకలితో అలమటిస్తున్న ప్రజలు మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాళ్లలాగా వ్యవహరిస్తున్నారు’ అని స్థానిక ఉపాధ్యాయుడు అండ్య్రూ పొమెదా (36) చెప్పారు. స్థానికంగా హృదయవిదారకమైన పరిస్థితి నెలకొందని, ప్రకృతి విపత్తుతో విచలితులైన ప్రజలు మరింత మానసిక కుంగుబాటుకు లోనయ్యే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రజలు హింసాత్మకంగా మారుతున్నారు. కేవలం పాలు, ఆహారం, అన్నం కోసం వారు వ్యాపార సముదాయాలు, షాపింగ్‌మాల్స్‌లలో చొరబడి దోపిడీలకు పాల్పడుతున్నారు. మరో వారం ఇలాగే గడిస్తే.. ప్రజలు ఆకలితో చనిపోయే అవకాశముంది’ అని చెప్పారు. ఇక తుఫాన్ బాధితులు జాంబీస్ (నడిచే శవాల) మాదిరిగా నగరంలో అల్లకల్లోలంగా తిరుగుతున్నారని, తుఫాన్‌తో మతిచెదిరిన చాలామంది పరిస్థితి భయానకంగా ఉందని స్థానిక విద్యార్థి జెన్నీ చూ తెలిపారు. తుఫాన్ నుంచి బయటపడినవారు ప్రాణాలు అరచేత పట్టుకొని, నగరంలోని శిథిలాలు, శవాల మధ్య తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతులు పదివేలకుపైనే
సూపర్ టైఫూన్ హైయాన్ సృష్టించిన పెనువిధ్వంసం తీవ్రతను అంచనా వేయడానికే ఇంకా టక్లోబన్ అధికారులు అవస్థలు పడుతున్నారు. ‘ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క లేతీ ప్రావిన్స్‌లోనే 10వేలకు పైచిలుకు మంది చనిపోయి ఉంటారు. గవర్నత్‌తో శనివారం రాత్రిజరిగిన సమావేశంలో ఈమేరకు నిర్దారణకు వచ్చాం’ అని లేతీ పోలీస్ చీఫ్ ఎల్మెర్ సొరియా విలేకరులకు తెలిపారు. ‘తుఫాన్ సాగిపోయిన దారిలో 70 నుంచి 80 శాతం ఇళ్లు, కట్టడాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. లేతీకి పొరుగున ఉన్న సమర్ దీవిలోనూ భారీ తుఫాన్ తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చింది. సమర్‌లోని చిన్న పట్టణమైన బసర్‌లో 300 మంది వరకు చనిపోయి ఉంటారని, మొత్తం ఈ ప్రావిన్సులో రెండువేల మంది గల్లంతు అయ్యారని విపత్తు నిర్వహణ సంస్థ అధికారి తెలిపారు. పసిఫిక్ సమువూదంలో కేంద్రీకృతమై శుక్రవారం గంటకు 315 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో సూపర్ టైఫూన్ హైయాన్ సెంట్రల్ ఫిలిప్పీన్స్‌ను ఢీకొట్టింది. మొదట దీనిబారిన సమర్ ప్రావిన్స్ పడగా, ఆ తర్వాత అది సెంట్రల్ ఫిలిప్పీన్స్ మీదుగా సాగిపోతూ.. 600 కిలోమీటర్లు పరిధిలోని తీరవూపాంత పట్టణాలు, నగరాలు, గ్రామాలను తుడిచిపె

విపత్తు సుడిగుండంలో ఫిలిప్పీన్స్
అనేక ద్వీపాల సమూహమైన ఫిలిప్పీన్స్‌ను అనునిత్యం ప్రకృతి సంక్షోభాలు, పెనువిపత్తులు చుట్టుముడుతూనే ఉన్నాయి. భయకరంమైన తుఫాన్‌లు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటి ప్రకృతి విపత్తులు సంభవించడం ఆ దేశానికి కొత్త కాదు. అయితే ప్రస్తుతం దాదాపు 10 వేల మందికిపైగా పొట్టనబెట్టుకున్న హైయాన్ తుఫాన్ ఫిలిప్పీన్స్ చరివూతలోనే అతిపెద్ద ప్రకృతి విపత్తుగా పరిశీలకులు భావిస్తున్నారు. పసిఫిక్ సమువూదంలో తుఫాన్ బెల్ట్‌గా పేరొందిన రింగ్ ఆఫ్ ఫైర్‌కు సమీపంలో ఉన్న ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు, తుఫాన్‌లు సర్వసాధారణంగా సంభవిస్తూ ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో సంభవించిన అతిపెద్ద ప్రకృతి విపత్తుల వివరాలివి.
-1976 ఆగస్టు 16న దక్షిణాన ఉన్న మిండానోవ్ ద్వీవిని భారీ భూకంపం, సునామీ సంభవించాయి. రిక్టర్‌స్కేలుపై 7.9 తీవ్రతతో సంభవించిన దీని ధాటికి 5 వేల నుంచి 8 వేల మంది వరకు జనం చనిపోయారు.
-1991 నవంబర్ 15న లేతీ ద్వీవిలోని కేంద్ర నగరం ఒర్మాక్‌లో మెరుపు వరదలు, ఉష్ణమండల తుఫాన్. 5,100 మంది మృతి
-2012 డిసెంబర్ 3న మిండానోవ్ దీవిపై టైఫూన్ బోఫా పంజా. ప్రకృతి విపత్తులో 1,900 మంది గల్లంతు లేదా మృతి
-1990 జూలై 16న ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని బాగ్వియో నగరం, దాని పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసిన భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత కలిగిన ఈ విలయంలో 1,621 మంది మృతి.
-1984 ఆగస్టు 31న సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో విరుచుకుపడిన టైఫూన్ ఇకా. 1,363 మంది మృతి
-1911 జనవరి 30న మనీలాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాల్ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో దాని సమీపంలోని గ్రామాలలో 1300 మంది మరణించారు.
-1814 ఫిబ్రవరి 1న ఫిలిప్పీన్స్‌కు తూర్పున ఉన్న మాయాన్ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో దాని సమీపంలో ఉన్న కాగ్‌సావా పట్టణం, దాని పరిసర ప్రాంతాలలో పర్వత శిథిలాలు, బూడిద వల్ల 1200 మంది చనిపోయారు.
-2006 ఫిబ్రవరి 17న లేతీ దీవిలోని పర్వత శిఖరం కుప్పకూలి గ్విన్‌సౌగన్ గ్రామంలో 1126 మంది మృతి.
-2011 డిసెంబర్ 16న మిన్‌డావో దీవిని ఢీకొట్టిన టైఫూన్ వాషి. 1080 మంది మృతి.
-1952 అక్టోబర్ 16న టైఫూన్ ట్రిక్స్‌తో లూజాన్ దీవిలోని బ్రికోల్ ప్రాంతంలో మెరుపు వరదలు. 995 మంది మృతి.
వియత్నాన్ని వణికిస్తున్న హైయాన్!
ఫిలిప్పీన్స్‌లో పెను విపత్తును మిగిల్చిన సూపర్ టైఫూన్ హైయాన్ క్రమంగా ముందుకుసాగుతూ వియత్నాన్ని వణికిస్తోంది. ఈ తుఫాన్ భయంతో తీర ప్రాంతాల్లోని ఆరు లక్షలమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం ఉదయం వియత్నాం తీరాన్ని ఢీకొట్టనున్న హైయాన్ ప్రభావంతో దేశ రాజధాని హనోయ్‌లో ఇప్పటికే భారీ వర్షాలు, వరదలు ప్రారంభమయ్యాయి. దీంతో వియత్నాం తీర ప్రాంతాలలో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. వేగంగా దూసుకువస్తున్న హైయాన్ ఒక్కసారిగా తన దిశను మార్చుకోవడంతో అప్రమత్తమైన వియత్నాం అధికారులు ఇటు ఉత్తర ప్రావిన్సుల్లోని తీర ప్రాంతాల నుంచి కూడా 52 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చైనాలో ఆరెంజ్ అలర్ట్!: సూపర్ టైఫూన్ హైయాన్.. చైనాపైనా ప్రభావం చూపనుంది. ఈ తుఫాన్ గమనాన్ని పసిగట్టిన చైనా తమ దేశంలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసింది. వాతావరణ వ్యవస్థలో రెండో అతి తీవ్రమైన ప్రమాద హెచ్చరిక ఇది. ఈ తుఫాన్ వల్ల దేశంలో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా చైనా ముందుజాక్షిగత్త చర్యలు తీసుకుంటోంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.