పదవీ బాధ్యతలు చేపట్టిన మాడభూషి శ్రీధర్

కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమితులైన ఆచార్య మాడభూషి శ్రీధర్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బికాజికామా, అగస్టు క్రాంతిభవన్‌లోని జాతీయ సమాచార కమిషన్ కార్యాలయంలో రూం నెంబర్ 315 ఆయనకు కేటాయించారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు సమాచార హక్కు చట్టం చక్కని సాధనమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.