పక్షపాత సీమాంధ్ర మీడియా

 

సీమాంధ్రలో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ర్యాలీ తీస్తే ప్రసారం చేయరు. ఆంధ్రాలో తెలంగాణవారిపై దాడి జరిగితే వార్త వేయరు. కర్నూలు ప్రభుత్వఆస్పత్రి నుంచి నిండు గర్భిణిని గెంటేస్తే వార్త వేయరు. విద్యుత్ సౌధలో తెలంగాణ ఉద్యోగిపై దాడిచేస్తే వార్త వేయరు. మీవి మీడియా సంస్థలా? బ్లాగులా? నీతిలేదు న్యాయంలేదు. ఏపీఎన్జీవో స్వయంప్రకటిత నేత అశోక్ హత్యలు జరుగుతయన్నా మీకు వార్తకాదు. అదే టీఆర్ఎస్ నేతలు రెచ్చగొడితే ఊరుకోబోమని చెప్తే.. ఆంధ్రోళ్లకు రక్షణ లేదని గగ్గోలు పెడుతరు. అంతా స్వార్థం. పక్షపాతం. మొత్తం సీమాంధ్ర మీడియా అట్లనే తయారయింది. ఈ మాత్రందానికి మీ చానళ్లు ఇక్కడెందుకు తీసుకెళ్లి మీ ఆంధ్రాలోనే పెట్టుకోండి. లేకపోతే సీమాంధ్ర చానళ్లని ప్రకటించుకోండి. సెక్రటేరియెట్ లో తెలంగాణవాళ్లు శాంతిర్యాలీ తీస్తే ఒక్క సీమాంధ్ర చానలోడు వార్త వేయలేదు. అదే ఆంధ్రోళ్లు సమావేశాలు పెట్టినా.. ధర్నా చేసినా రోజంతా లైవ్ లు తీసుకున్నరు. ఇదేనా ఎన్టీవీ ప్రజాహితం.. ఇదేనా టీవీ9 మెరుగైన సమాజం.. ఇదేనా తెలుగువారి మనస్సాక్షి, ఇవేనా ఈటీవీ2 విలువలు..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories, VIDEOS.

One Response to పక్షపాత సీమాంధ్ర మీడియా

  1. చంద్రశేఖర్ says:

    అశోక్ బాబు విద్యార్హతపై ఎదో కేసు నడుస్తున్నదట.. జర దాని గురించి ఆరా తీయుండ్రి.. మన లాయర్లకు చెప్పండ్రి.. కోర్టు అడిగినా ఇప్పటివరకు సమాదానం లేదంట.. అలాగే హౌసింగ్ సోసైటీలో కోట్ల గోల్ మాల్ కేసులో పోలీసులు పరారీలో ఉన్నట్లుగా చెబుతున్న చంద్రశేఖర్ రెడ్డి, మరో వ్యక్తి ౭వ తేదీ నాటి సభకు వచ్చారంట.. పరారీలో ఉన్న వ్యక్తులు బహిరంగంగా అందునా పోలీసుల కళ్లేదుటే వేదికలెక్కి మాట్లాడుతుంటే డిసిపి ఏం చేస్తున్నట్లు.. ఉద్దేశపూర్వకంగానే ఆయన పట్టించుకోలేదన్నట్లుగా డిసిపి పై కోర్టులో కేసు వేయవచ్చట.. మన లాయర్లకు చెప్పండి..