పంట రుణాల్లో వివక్ష

farmerసీమాంవూధకు రూ.22264 కోట్లు.. తెలంగాణకు రూ.9731కోట్లే
పంపిణీలోనూ తెలంగాణకు కనిష్ఠాలే.. చిత్తూరు, అనంతపురానికి పెద్దపీట
రైతు కష్టం ఎక్కడైనా ఒక్కటే! కానీ.. సర్కారు దృష్టిలో తెలంగాణ రైతు కష్టం గొప్పదేమీ కాదు! తెలంగాణ రైతులంటే ఒకింత వివక్షే! ఇది ఎప్పటి సంగతో కాదు. ఇప్పటిదే! 2013-14 సంవత్సరానికి రైతులకు ఏయే జిల్లాల్లో ఎంతెంత పంట రుణాలు కేటాయించాలన్న జాబితాను గమనిస్తే.. తెలంగాణ పట్ల వీడని నిర్లక్ష్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణ ప్రాంతానికి కేవలం రూ.9731కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. సీమాంధ్ర ప్రాంతానికి రూ.22264 కోట్లు మంజూరు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది రూ.31,996.07 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో ఇప్పటివరకు పంపిణీ చేసిన పంట రుణాలు రూ.6259.04 కోట్లు మాత్రమే. అంటే వ్యవసాయ శాఖ 20% రుణాలను మాత్రమే పంణీ చేయగలిగింది. పంపిణీ చేసిన రుణాల్లోనూ ప్రభుత్వం ప్రాంతాల మధ్య తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరుకు రూ.1226కోట్లు పంట రుణాలను లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికే రూ.662కోట్లు పంపిణీ చేశారు. అంటే 54% రుణాల పంపిణీ పూర్తయింది. రెవెన్యూ శాఖ మంత్రి ఎన్ రఘువీరాడ్డి సొంత జిల్లా అయిన అనంతపురానికి లక్ష్యం రూ.2658కోట్లు అయితే, రూ.800కోట్లు ఇప్పటికే పంపిణీ చేసేశారు. అంటే 30% పంట రుణాల పంపిణీ జరిగింది. కానీ.. తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. రంగాడ్డి జిల్లాకు రూ.438కోట్లు పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటే కేవలం రూ.75కోట్లు పంపిణీ చేశారు.

listఎందుకీ వివక్షని అధికారులను ప్రశ్నిస్తే రంగాడ్డి జిల్లాల్లో వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడంతో సర్కార్ దృష్టి సారించలేదని కుంటి సాకులు చెబుతున్నారు. ఇదే వాస్తవం అయితే నల్లగొండ జిల్లాలో రూ.1011.77కోట్లు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం జూలై 8వరకు పంపిణీ చేసింది కేవలం రూ.122 కోట్లే ఎందుకు పంపిణీ చేసిందంటే మాత్రం అధికారులు స్పందించడం లేదు. తెలంగాణ ప్రాంతంలో పంట రుణాలు పంపిణీ చేయడంలో ఎంత వివక్ష కొనసాగుతుందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని ఇక్కడి రైతు సంఘాల నేతలు అంటున్నారు. మెదక్ జిల్లాకు పంట రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నదే చాలా తక్కువ టార్గెట్. అందులో పంపిణీ చేసింది రూ.116 కోట్లు మాత్రమే. కేటాయింపుల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లాల్లో రూ.882కోట్ల కంటే తక్కువ టార్గెట్ ఏ ఒక్క జిల్లాకు కూడా లేకపోవడం విశేషం.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.