నోట్లో మట్టి కొట్టిన వారితో ఎట్ల కలిసుంటం?: శ్రవణ్

హైదరాబాద్ : పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టిన వారితో ఎట్ల కలిసుంటామని టీఆర్‌ఎస్ నేత డాక్టర్ శ్రవణ్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాయలసీమ నేతలే ఎక్కువ కాలం సీఎంలుగా ఉన్నారని గుర్తు చేశారు. రాయలసీమ నేతలు సీఎంలుగా ఉన్న కాలంలోనే తెలంగాణ అన్యాయానికి గురైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణకు ఒప్పుకోమని తేల్చిచెప్పారు. ఎవరి కోసం ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన అని ప్రశ్నించారు. రాయలసీమ ఫ్యాక్షనిస్టులతో తామేందుకు కలవాలని అడిగారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవించాలన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని కాంగ్రెస్‌కు ఆయన సూచించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే తెలంగాణను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.