‘నేరం అధికారమైంది, న్యాయం అరెస్ట్ అవుతోంది’

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల అకాంక్షను శాంతియుతంగా నిరసన రూపంలో తెలియజేస్తే ప్రజాస్వామ్యంలో నేరం అయిపోయింది. అసలు ‘నేరం అధికారం చెలాయిస్తుంటే.. న్యాయం అరెస్టు అవుతుందని’ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. సడక్ బంద్‌లో పాల్గొనేందుకు మహబూబ్‌నగర్ చేరుకున్న కోదండరాం మీడియాతో మాట్లాడారు. మణిపూర్, కశ్మీర్‌లో టెర్రరిస్టులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న తెలంగాణ ఉద్యమంపై పాశవిక అణచివేతను అమలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.