నేనే సీఎంనైతే.. పనిచేయని అధికారుల్ని జైల్లోపడేస్తా – 15 రోజుల్లో శాంతిభవూదతలు అదుపులోకి తెస్తా : ములాయం

– అఖిలేశ్ ప్రభుత్వంపై విమర్శలు
లక్నో: ఎప్పుడూ యూపీఏ, కాంగ్రెస్‌పై విమర్శలు చేసే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఈసారి సొంత ప్రభుత్వంపైనే నిప్పులు చెరిగారు. అఖిలేశ్ ప్రభుత్వం ప్రభుత్వ విధానాలు అమలుచేయడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉదాసీనత ప్రదర్శిస్తున్నదని విమర్శలు చేశారు. పైగా నేనే.. ముఖ్యమంవూతినైతే 15 రోజుల్లో వ్యవస్థను మార్చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అఖిలేశ్ స్థానంలో నేనే ఉంటే 15 రోజుల్లో రాష్ట్రంలో శాంతిభవూదతల ముఖచిత్రం మార్చేసి ఉండేవాడిని.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీ శాంతిభవూదతలకు బాధ్యత వహించాలి. అవసరమైతే వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అధికారులు ప్రభుత్వ ఆదేశాల్ని పాటించరో, చట్టాన్ని అతిక్షికమిస్తారో వారిని జైల్లో పడేయాలి’’ అని అన్నారు. ‘‘చట్టం ముందు అందరూ సమానమే. అధికారులను జైలుకు పంపడంలో తప్పేముంది’’ అని పునరుద్ఘాటించారు. అఖిలేశ్ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నాడేమోనని విలేకరులు సందేహం వ్యక్తం చేయగా.. ‘‘అఖిలేశ్‌పై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నేను అతడితో మాట్లాడి 15-20రోజులకు పైగానే అయ్యింది. అతడికి సలహా ఇస్తానే తప్ప, ఒత్తిడి చేయను. అతడికి నేను తండ్రినే అయినా, పార్టీకి అధ్యక్షుడిని కూడా’’ అని పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.