నేతల చేత.. నేతల వలన.. నేతల కోసం సీమాంధ్ర లొల్లి

-ఇదేం ప్రజాస్వామ్యం?

-తెలంగాణకు మద్దతు పలికిన పార్టీలు
-నిర్ణయం వెలువడ్డాక ప్లేటు ఫిరాయింపు
-సోనియాకే లేఖ రాయించిన వైఎస్
-ప్రణబ్ కమిటీకి లేఖ రాసిన బాబు
-సెంటిమెంట్ గౌరవిస్తామన్న జగన్
-అఖిలపక్షాల్లోనూ అదే మాట
-సీడబ్ల్యూసీ నిర్ణయంతో యూటర్న్.. మళ్లీ అవే కృత్రిమ ఆందోళనలు..
-రాజీనామా నాటకాలు.. సీమాంధ్రలో ఆధిపత్యం కోసం ఆరాటాలు

s-lollyఒక పార్టీ అసలు తెలంగాణ సెంటిమెంటును తామే తెరపైకి తెచ్చామన్నది! మరొక పార్టీ తెలంగాణ తీర్మానం మీరు పెడతారా? మమ్మల్నే పెట్టమంటారా? అంటూ గప్పాలు కొట్టుకుంది! తెలంగాణ సెంటిమెంటును మాకంటే గౌరవించేవారే లేరన్నట్లు గొప్పగా చాటుకుంది ఇంకోపార్టీ! కాలం గడిచిపోయింది.. సెంటిమెంటు గురించి మాట్లాడిన పార్టీలు.. చేసిన వాగ్దానాలను బుట్టలో పడేశాయి! తెలంగాణపై యూ టర్న్ తీసుకున్నాయి! ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిర్ణయం రానే వచ్చాక.. తమ అసలు స్వరూపాన్ని బయటపడేసుకున్నాయి! వీధులకెక్కి.. రాద్ధాంతం చేస్తున్నాయి. విభజనకు మద్దతు పలికిన పార్టీలే.. తెలుగుజాతి ముక్కలైపోతున్నదని విషాదగీతాలు ఆలపిస్తున్నాయి. కానీ.. హైదరాబాద్ ఇచ్చేస్తే.. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే.. గప్‌చుప్ సాంబార్ బుడ్డీ! ఇదీ సమైక్యవాదం అసలు రంగు! తమ ప్రయోజనాల సాధన కోసం రాష్ట్ర విభజన కీలక దశను ఆటంకపరిచే కుట్ర! విభజన అనంతర పరిస్థితులను క్యాష్ చేసుకునే పన్నాగం!

తెలంగాణ ఏర్పాటు విషయంలో జరిగిన కసరత్తు అంతా ఇంతా కాదు. తెలంగాణ ఆవశ్యకతను గుర్తించాం కాబట్టే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ అధిష్ఠానం విస్పష్టంగా ప్రకటించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజ్యాంగపర ప్రక్రియ మొదలయి తీరుతుందని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాటిన బీజం ప్రాధాన్యం ఎంతో ఉంది. అనంతరం కాలంలో టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో ఉధృతంగా మారిన ఉద్యమ ఒరవడి ఉంది. వివిధ సందర్భాల్లో వివిధ పార్టీల నేతలు తెలంగాణకు అనుకూలంగా చేసిన ప్రకటనలు ఉన్నాయి. అఖిలపక్షాల్లో వెల్లడించిన అభివూపాయాలు మద్దతుగా నిలిచాయి. ఇంత గొప్ప ప్రజాస్వామిక ప్రక్రియను తెలంగాణ దాటింది. ప్రజాస్వామ్య సాధారణ మెజార్టీ సూత్రాన్ని పక్కనపెట్టి.. గరిష్ఠ ఏకాభివూపాయాన్ని సాధించింది. అందుకే కాంగ్రెస్ తెలంగాణపై నాన్చలేని పరిస్థితి తలెత్తింది. కానీ.. ఆ ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచేలా కాంగ్రె స్, టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర కాంగ్రెస్ నేతల రెండు నాల్కల ధోరణి
తెలంగాణ విషయలో కాంగ్రెస్ నాటకం తీరేవేరు. తెలంగాణను వ్యతిరేకిస్తామని చెబుతూనే.. అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు, తెలంగాణపై ప్రకటన రాగానే అడ్డం తిరిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌డ్డి సైతం తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంవూతినన్న విషయం పక్కనపడేసి.. ఒక ప్రాంత సుదీర్ఘ రాజకీయ ఆకాంక్షకు అడ్డం పడుతున్నారు. వాస్తవానికి తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు.

1999 ఎన్నికల తరువాత సీఎల్‌పీ నేతగా ఎంపికైన వైఎస్ రాజశేఖర్‌డ్డి.. తెలంగాణ రాష్ట్రం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ 41 మంది ఎమ్మెల్యేల చేత ఆనాడు హైదరాబాద్ వచ్చిన సోనియాగాంధీకి వినతిపత్రం ఇప్పించారు. ఆ తరువాత 2001లో చిన్నాడ్డి కన్వీనర్‌గా తెలంగాణ రీజనల్ కమిటీ వేయడంలోనూ కీలక పాత్ర వహించారు. అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామని 2004 ఎన్నికల ప్రణాళికలో చేర్చి టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కనీస ఉమ్మడి కార్యక్షికమంలో చేర్చింది. రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపర్చారు. దీనిపై చర్చించడానికి నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. 2009 ఎన్నికలకు ముందు జరిగిన చివరి అసెంబ్లీ సమావేశంలో ఫిబ్రవరి 12న తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, స్టేక్ హోల్డర్లతో చర్చించడానికి అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య అధ్యక్షతన కమిటీ వేస్తున్నట్లు వైఎస్ ప్రకటించారు. కాంగ్రెస్ మళ్లీ గెలిచింది.

వైఎస్ మరణంతో రోశయ్య సీఎం అయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమించారు. దీంతో రోశయ్య అధ్యక్షతన 2009 నవంబర్ 7న జరిగిన అఖిలపక్షం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ప్రతినిధులు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. ఈ సమావేశం మినిట్స్ ఆధారంగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9న ప్రకటించింది. అంతే అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర నేతలు అడ్డం తిరిగారు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నారు. కేంద్రం వెనక్కు తగ్గడంతో తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ శత్రువుగా మారింది. ఉద్యమాలకు తట్టుకోలేకపోయిన టీ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 2012 డిసెంబర్ 2 8 చివరి అఖిలపక్షం జరిగింది. నెల రోజుల్లో నిర్ణయం ఉంటుందని షిండే ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించారు. కానీ.. నెల అంటే 30 రోజులు కాదని ఆజాద్ సెలవీయగా.. తెలంగాణ ఇవ్వడం దోశె వేసిచ్చినంత ఈజీ కాదని వీరప్ప మొయిలీ ఎద్దేవా చేశారు. వీరి వ్యాఖ్యలతో తెలంగాణ అట్టుడికిపోయింది.

అనంతర పరిణామాల్లో పీసీసీ మాజీ అధ్యక్షులు కే కేశవరావుతో పాటు ఆ పార్టీ ఎంపీలు మంద జగన్నాథం, జీ వివేక్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల వేళ.. మరింత మంది టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశం ఉందన్న వార్తలతో కాంగ్రెస్ అధిష్ఠానం కలతపడింది. తెలంగాణపై చర్చలు మొదలుపెట్టింది. దిగ్విజయ్‌సింగ్‌ను రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమించింది. జూన్ 30న నిజాం కాలేజీ మైదానంలో టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ సాధన సభను విజయవంతంగా నిర్వహించారు. మరుసటి రోజే హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్.. తెలంగాణపై రోడ్‌మ్యాప్‌లు తీసుకురావాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిని ఆదేశించారు. జూన్12న జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఈ ముగ్గురు నేతలు రోడ్‌మ్యాప్‌లు వివరించారు. సీఎం, పీసీసీ చీఫ్‌లు సమైక్యమన్నారు. కానీ.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కానీ.. జూలై 30న సీడబ్యుసీ సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకోగానే అడ్డం తిరిగారు. సీమాంవూధలో కృత్రిమ సమైక్య ఉద్యమం చేయిస్తున్నారు. రాజీనామాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు.

ండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ
తెలంగాణకు అనుకూలంగా టీడీపీ 200 8 అక్టోబర్ 9న పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకున్నది. ఆ తరువాత తెలంగాణపై ఏర్పడిన ప్రణబ్ కమిటీకి 200 8 అక్టోబర్ 1 8న పార్టీ తరపున చంద్రబాబు లేఖ రాశారు. ఇప్పటికీ ఆ లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ అధినేత చెబుతూనే ఉన్నారు. ఆ పార్టీ సీమాంధ్ర నాయకులు ఇదే మాట అంటారు. కానీ.. పార్టీ నిర్ణయాన్ని విలువలేనిదిగా చేసి, తెలంగాణను అడ్డుకోవడానికే సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడటమంటే పార్టీ తరఫున అభివూపాయాలు వెల్లడించడమే! అలాంటి వేదిక నుంచి మాట్లాడిన సీమాంధ్ర నేతలు.. తాము ప్రజల మనోభావాల ప్రకారమే రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించేస్తున్నా.. ఏ ఒక్క నేతా కిక్కురుమనరు! ఇది పార్లమెంటు స్థాయి నేతలకూ పాకింది. పార్లమెంటు ఉభయ సభలు వేదికగా చేసుకుని.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారు టీడీపీ ఎంపీలు. అంతా రెండు కళ్ల సిద్ధాంతం! 200 8లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది మొదలు.. టీడీపీలో వర్థిల్లుతున్నది ఈ సిద్ధాంతమేననడంలో సందేహం లేదు! కేంద్రానికి ఇచ్చిన లేఖను చూపించుకుని, తన రాజకీయ నిరుద్యోగాన్ని వదిలించుకునేందుకు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు దిగింది టీడీపీ. తర్వాత 2009లో కేసీఆర్ ఆమరణ దీక్షతో దిగివచ్చిన కేంద్రం.. డిసెంబర్9 ప్రకటన వెలువరిస్తూ తెలంగాణను ప్రకటించింది. దీనికి ముందు రోజు అప్పటి సీఎం రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా ‘తెలంగాణపై తీర్మానం మీరు ప్రవేశ పెడతారా? లేక మమ్మల్నే పెట్టమంటారా? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీసిన వాస్తవం రికార్డయి ఉంది.

అప్పుడూ ఇదే జరిగింది. మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టిన చంద్రబాబు.. రాత్రికి రాత్రి తెలుగుజాతిని చీల్చారని ఆక్రోశం వెళ్లగక్కారు. తర్వాతి కాలంలో రెండు కళ్ల సిద్ధాంతం తెచ్చి.. ఎక్కడివారు అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమాలు చేసుకోవచ్చని సెలవిచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. మళ్లీ రాజకీయ అవసరాలు గుర్తుకురావడంతో మార్పు వచ్చింది. 2012 డిసెంబర్ 2 8న కేంద్ర హోం మంత్రి షిండే ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ వైఖరి మారలేదని, తమ గత లేఖల్లో ఉన్న డిమాండ్‌ను అమలు చేయాలని ఆ పార్టీ ప్రతినిధులు కోరారు. అనంతర పరిణామాల నేపథ్యంలో చివరకు జూలై 30న తెలంగాణ ఇవ్వాలని సీడబ్యుసీ, యుపీఏ పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. అంతే టీడీపీ నాయకులు తమ ప్రజల మనోభావాల మేరకు అంటూ రాజీనామాలు చేశారు. కృత్రిమ సమైక్య ఉద్యమాలను పోటీ పడి నడిపిస్తున్నారు.

రాజకీయ అవసరానికే వైఎస్ ఆర్‌సీపీ తెలంగాణ
వైఎస్సార్సీపీది తెలంగాణ విషయంలో వింతైన దోబూచులాటే! తెలంగాణకు వ్యతిరేకంగా ఒకనాడు పార్లమెంటులో ప్లకార్డు పట్టిన నాయకుడు.. ఈ పార్టీకి సారథి! కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత, తెలంగాణలోని ఓట్లు కూడా కావాల్సిన సమయం వచ్చేసరికి.. దోబూచులు మరింత పెరిగాయి. 2011 జూలై 9న ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీలో తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నట్లు ప్రకటించింది. ‘నా కుటుంబం కోసం.. నన్ను ఒంటరిని చేయడం ఇష్టం లేక.. నాకు అక్కలాంటి సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నాం’ అని ఆ సందర్భంగా జగన్ ప్రకటించారు. 2009 ఎన్నికలలో తెలంగాణలో పోలింగ్ పూర్తి కాగానే తన తెలంగాణ వ్యతిరేకతను చాటిన వైఎస్.. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన సభలో రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ వెళ్లాలంటే వీసాలు, పాస్‌పోర్టులు అవసరమవుతాయంటూ విషం చిమ్మారు. సీమాంవూధులను రెచ్చగొట్టి.. ఎన్నికల్లో ఆ మేరకు లబ్ధి పొందారు. తండ్రి బాటలో నడిచిన జగన్ 2009 డిసెంబర్15న కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డ్ పట్టుకున్నారు.

జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. పార్టీ పెట్టిన తరువాత తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించబోమని ఢిల్లీ అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. సెంటిమెంటును గౌరవిస్తున్నందున తెలంగాణ ఉప ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపడం లేదని ప్రకటించారు. 2012 జూన్9న పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ విజయమ్మ తెలంగాణ ఇవ్వాల్సింది కేంద్రమేనని, వారు తెలంగాణ ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ ప్లీనరీలో చెప్పాడని ప్రకటించారు. 2012 డిసెంబర్ 2 8న జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరో అడుగు ముందుకేసి.. రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని సుద్దులు చెప్పారు. తీరా జూన్ 30న కాంగ్రెస్ నిర్ణయం తీసుకోగానే యూటర్న్ తీసుకున్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేశారు.

ఎందుకీ ఆందోళనలు.. ఆగ్రహాలు?
సీమాంధ్ర పార్టీలుగా తమను తాము నిరూపించుకుంటున్న పార్టీలు.. ఇంతటి సాహసానికి ఎందుకు తెగిస్తున్నాయి? సమైక్య ఆందోళనల్లో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నేతలు పోటీలు పడి మరీ ఎందుకు ముందుంటున్నారు? సమాధానం ఒక్కటే. సీమాంవూధలోని రాజకీయ ప్రయోజనాలు! విభజన అనివార్యమని తేలిపోయిన వేళ.. కనీసం తమ ప్రయోజనాలు సాధించుకునే క్రమంలో ఆందోళనలు చేశామని జనానికి చెప్పుకునే తాపవూతయం. ఉన్నంతలో తమ ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకునే యత్నం. ఇదే సీమాంధ్ర నేతలు సృష్టించిన కృత్రిమ ఆందోళనల వెనుక ఉన్న మంత్రాంగం! ఏది ఏమైనా.. ఆ మూడు పార్టీలు ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను అవహేళన చేస్తున్నాయి. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అనైతికంగా ప్రవర్తిస్తున్నాయి. సీమాంవూధలో తమ రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం.. రానున్న ఎన్నికల్లో పైచేయి సాధించడం కోసం ఆందోళనలకు పురికొల్పుతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. బాబోయ్.. ఏం ప్రజాస్వామ్యమిది?

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.