నేడు తెలంగాణ స్ఫూర్తి దినం

– కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించాలి
– టీజేఏసీ, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు
తెలంగాణ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం (డిసెంబర్ 9) తెలంగాణవ్యాప్తంగా స్ఫూర్తి దినం నిర్వహించాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం, కో చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్‌రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సాయంత్రం కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనను నిర్వహించాలని సూచించారు. శనివారం జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం గన్‌పార్క్ వద్ద టీజేఏసీ ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్షికమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం సహా అన్ని జేఏసీల నాయకులు పాల్గొంటారని చెప్పారు.

టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో..
తెలంగాణ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం తెలంగాణవ్యాప్తంగా కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి స్ఫూర్తి దినం జరుపుకోనున్నట్లు టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీ వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఈ కార్యక్షికమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ ఆధ్వర్యంలో…
టీజేఏసీ పిలుపు మేరకు తెలంగాణవ్యాప్తంగా ఆదివారం స్ఫూర్తి దినం నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ టీ రాజేశ్వర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనను జరపనున్నట్లు చెప్పారు. ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి నిరసన ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్షికమంలో పార్టీ నేతలు ప్రకాశ్ జవదేకర్, కిషన్‌డ్డి, కే లక్ష్మణ్, బండారు దత్తావూతేయ, బీ వెంకట్‌డ్డి తదితరులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.