నేడు తెలంగాణ జేఏసీ ‘సంసద్ యాత్ర’

హైదరాబాద్: ‘సంసద్ యాత్ర’లో భాగంగా తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. 19 బోగీలతో కూడిన ప్రత్యేక రైలు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటుంది. ఈ నెల 29, 30వ తేదిల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘ తెలంగాణ సత్యాగ్రహం’ పేరుతో దీక్ష నిర్వహించనున్నారు. దీక్షలో కేసీఆర్, బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి, ఏబీ బర్దన్, కేంద్ర మంత్రి అజిత్‌సింగ్, బీఎస్పీ నేతలు హాజరు కానున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.