నేడు తీరందాటనున్న నీలం!

ONGOLE-(2)
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భారీ తుఫాన్‌గా మారింది. ఇది బుధవారం సాయంవూతానికి లేదా రాత్రికి తమిళనాడులోని నాగపట్నం, ఆంధ్రవూపదేశ్‌లోని నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని చెన్నైలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. దీంతో తమిళనాడు, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దంటూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైకి ఆగ్నేయాన 450 కిలోమీటర్ల దూరంలో, ట్రింకోమలీకి (శ్రీలంక) ఈశాన్యాన 100 కిలోమీటర్ల దూరంలో ‘నీలం’ (తుఫాన్ పేరు) నెలకొన్నట్లు చెన్నైలోని అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున తుఫాన్ దిశ మారిందని, శ్రీలంక నుంచి భారత్ దిశగా వెళుతోందని కొలంబోలోని వాతావరణ శాఖ డైరెక్టర్ శరత్ లాల్ కుమార చెప్పారు. దీంతో శ్రీలంకకు ప్రమాదం తప్పిన తెలిపారు. తమిళనాడులో తుఫాను ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. మంగళవారం ఎడతెగని వర్షం వల్ల చెన్నై, కాంచీపురం, కడలూర్, విల్లుపురం ప్రాంతాల్లో సాధారణ జన జీవనానికి ఆటంకం కలిగింది. చెన్నైతోపాటు కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దాదాపు మూడొందల తాత్కాలిక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సముద్రం తీవ్ర కల్లోలంగా ఉన్నందున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రవూపదేశ్ తీరవూపాంతాల్లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు. చెన్నైలో గాలుల వేగం గంటకు 90 కిలోమీటర్లకు చేరుకోవచ్చని, ఫలితంగా కమ్యూనికేషన్ లైన్లలో అంతరాయం కలుగవచ్చని పేర్కొన్నారు. చెన్నై, ఎన్నూర్, కడలూర్, నాగపట్నం, పుదుచ్చేరి ఓడరేవుల్లో ఐదో నంబర్ నుంచి ఏడో నంబర్ వరకు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.
NELLORE-(3)
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం భారీ తుఫాన్‌గా మారడంతో దాని ప్రభావం తమిళనాడుతోపాటు ఆంధ్రవూపదేశ్‌లోని తీర ప్రాంతాలపైనా పడనుంది. చెన్నైకి ఆగ్నేయాన 450 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న తుఫాన్ ‘నీలం’ బుధవారం రాత్రికల్లా నెల్లూరు సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ పరిణామాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులంతా అందుబాటులో ఉండాలని కలెక్టర్లు అప్రమత్తం చేశారు. కోస్తా జిల్లాల్లో కంట్రోల్ రూంలను నెలకొల్పారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. భారీ స్థాయిలో గాలులు వీస్తూ, వర్షాలు పడే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని నెల్లూరు జిల్లా అధికారులు సూచించారు. తీరవూపాంతంలో అలల ఉధృతి పెరగడంతో అల్లూరు మండలం ఇస్కపాళెం వద్ద తుఫాన్ షెల్టర్ కూలిపోయింది. కోస్తా ప్రాంతంలోని 23 తహసిల్‌ల రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ బీ శ్రీధర్ తెలిపారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, గోదావరి జిల్లాలకూ హెచ్చరికలు జారీ అయ్యాయి. కృష్ణపట్నం ఓడరేవు, నిజాంపట్నం రేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు, మచిలీపట్నం ఓడరేవులో నాలుగో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏ రకమైన పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బుద్ధవూపకాశ్ జ్యోతి చెప్పారు. ప్రకాశం జిల్లాలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒంగోలు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం నెలకొల్పారు. తీరవూపాంతంలోని పదకొండు మండలాల అధికారులను అప్రమత్తంగా ఉండాల్సిందిగా కలెక్టర్ అనితా రాజేంద్ర ఆదేశించారు. అమలాపురం సమీపంలో తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో మత్స్యకారుల పడవ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక పడవను పంపామని, బుధవారం ఉదయంకల్లా అందరినీ క్షేమంగా ఒడ్డుకు చేరుస్తామని అమలాపురం ఆర్డీవో సంపత్‌కుమార్ తెలిపారు. మొత్తానికి ఎప్పుడు ఏమవుతుందోననే భయం తీరవూపాంత వాసులను వెన్నాడుతోంది. ఇక వరి పంట పొట్ట దశలో ఉండగా, మరో మూడువారాలకల్లా మూడొంతులకుపైగా కోతకు వచ్చేదుండగా ఈ పరిణామం కోస్తా ప్రాంతంలోని రైతులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.