నేడు టీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో జరగనుంది. టీ జేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ, విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ తేదీలను ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించేందుకు నెల రోజుల ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విస్తృత స్థాయి సమావేశంలో తుదిరూపం ఇవ్వనున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.