నేటి నుంచి బయ్యారం యాత్ర

kodandaram-తెలంగాణ వనరుల సంరక్షణే లక్ష్యం
-యాత్రను ప్రారంభించనున్న కోదండరాం
-11 నియోజకవర్గాల్లోని 38 గ్రామాలలో యాత్ర
-రేపు మానుకోటలో ప్రతిఘటన స్ఫూర్తి సభ.. సాయంత్రం బయ్యారంలో సభ
తెలంగాణ వనరుల దోపిడీపై వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం తెచ్చే లక్ష్యంతో టీ జేఏసీ ఆధ్వర్యంలో బయ్యారం సంరక్షణ యాత్ర సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ యాత్రను ‘ఇనుపఖనిజ పరిరక్షణ యాత్ర ’ అని కూడా పిలుస్తామని టీ జేఏసీ సమన్వయకర్త పిట్టల రవీందర్ ప్రకటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటలకు టీ జేఏసీ కార్యాలయం వద్ద సభను నిర్వహించనున్నారు. టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ నాయకుడు నాయిని నరసింహాడ్డి, బీజేపీ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, రాజేశ్వరరావు, న్యూడెమొక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యులు పీ సూర్యం, కే గోవర్ధన్ ఈ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతారు. అనంతరం కోదండరాం బస్సుయావూతను ప్రారంభిస్తారు.

50 వాహనాలలో యాత్ర ప్రారంభమవుతుందని, షామీర్‌పేట చేరుకొనే సరికి వందల వాహానాలతో యాత్ర మహా ప్రవాహమవుతుందని ప్రోగ్రామ్స్ కమిటీ నాయకులు, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనులను సీమాంధ్ర ప్రభుత్వం కేటాయించిందని, ఈ కేటాయింపులను రద్దుచేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించారని, అందువల్లే తెలంగాణ ప్రజలు అనివార్యంగా ఈ యాత్రను బయ్యారం సంరక్షణ యాత్ర అని మాత్రమే కాకుండా, ఇనుపఖనిజ పరిరక్షణ యాత్రగా కూడా చేపడుతున్నారని పిట్టల రవీందర్ తెలిపారు.

ఈ క్రమంలో భీమదేవరపల్లి, హసన్‌పర్తి, కరీంనగర్, వరంగల్, గూడూరు, ధర్మసాగరం, ఖమ్మం, చర్ల, నేలకొండపల్లి, బయ్యారం మండల కేంద్రాలలో జరిపే యాత్ర చాలా కీలకమైనదని, తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో హాజరుకావాలని టీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ యాత్ర మేడ్చెల్, గజ్వెల్, హనుమకొండ, హుస్నాబాద్, వరంగల్, పరకాల, నర్సంపేట మానుకోట, ఇల్లెందులతో కలిపి మొత్తం పదకొండు నియోజకవర్గాలలో, 38 గ్రామాలలో కొనసాగుతుందని జేఏసీ అధికారికంగా తెలియచేసింది. యాత్రలో భాగంగా షామీర్‌పేటలో సభ నిర్వహిస్తారు. అక్కడి నుంచి యాత్ర గజ్వేల్ చేరుకుంటుంది. అనంత రం సిద్దిపేటలో అమరుల స్థూపానికి నివాళులర్పిస్తారు.

ఉద్యమయాత్రను కరీంనగర్‌లో జేఏసీ నేతలు ఆహ్వానిస్తారు. సోమవారం రాత్రి హనుమకొండలో బస చేస్తారు. మంగళవారం హన్మకొండ నుంచి నర్సంపేట చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు మానుకోటలోని బొడ్రాయి దగ్గర ప్రజావూపతిఘటన స్ఫూర్తిసభను నిర్వహిస్తారు. వైఎస్ జగన్‌ను మానుకోట ప్రజలు ప్రతిఘటించి మే 28వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తవుతున్నందున ఈ సభకు విస్తృత ప్రాధాన్యం ఏర్పడింది. సభ తర్వాత బయ్యారం వరకు బైక్‌ర్యాలీ జరపాలని నిర్ణయించారు. ఆ తర్వాత బయ్యారంలో బహిరంగ సభ జరుపుతారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.