నేటి నుంచి టెట్ దరఖాస్తులు

  హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు మంగళవారం నుంచి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సోమవారం నుంచే దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువు ప్రారంభమయింది. నోటిఫికేషన్ వివరాలు టెట్ వెబ్‌సైట్‌లో ఉంచారు. 1 నుంచి 5 తరగతులకు బోధించేవారు పేపర్-1 పరీక్షకు, ఆరు నుంచి ఎనిమిది తరగతులకు బోధించేందుకు పేపర్-2కు హాజరుకావాల్సి ఉంటుంది. 1 నుంచి తరగతులకు బోధించాలనుకునే అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరుకావాల్సి ఉంటుంది. టెట్‌లో అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు 60శాతం, బీసీ విద్యార్థులు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 40శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికి మూడు టెట్‌లు పూర్తవగా ఇది నాలుగోది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.