నెలాఖరులోపు డ్రాఫ్ట్ బిల్లుపై స్పష్టత : షిండే

న్యూఢిల్లీ: ఈనెలాఖరులోగా తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుపై ఒక స్పష్టత వస్తుందని కేంద్రహోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. అప్పటి వరకు జీవోఎం ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇవాళ రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవోఎంకు పద్దెనిమిది వేల మెయిల్స్ వచ్చాయని షిండే పేర్కొన్నారు. ఈ నెలఖారులోగా జీవోఎం తన పని పూర్తి చేస్తుందని వెల్లడించారు. 18న రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 12, 13న రాష్ట్రానికి చెందిన పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతలను పంపవచ్చని ఆయన చెప్పారు. ప్రతిపార్టీకి 20 నిమిషాల సమయం కేటాయిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ భద్రత, సీమంధ్ర ప్యాకేజీ అంశం బిల్లులో రూపొందిస్తామని స్పష్టం చేశారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.