నిర్భయ కేసులో నలుగురు దోషులకు రేపు శిక్ష

delhi న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచారం కేసులో నలుగురు నిందితులను సాకేత్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. బుధవారం వారికి కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. శిక్షపై దోషుల వాదనలను కోర్టు రేపు విననుంది. ఈ ఉదయం నలుగురు నిందితులను కోర్టు ముందు హాజరు పరిచారు. దోషులకు శిక్ష ఖరారుపై రేపు ఉదయం 11 గంటలకు వాదనలు ప్రారంభం కానున్నట్లు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితడు రాంసింగ్ మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. మరో నిందితుడు మైనర్ కావడంతో అతడికి బాలల న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించాలని నిర్భయ తల్లిదండ్రులు, పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.