నిర్ణయం జరిగిపోయింది : ఏపీఎన్జీఓలతో ప్రధాని

న్యూఢిల్లీ : తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని ఏపీఎన్జీలకు ప్రధాని మన్మోహన్ సింగ్ స్ఫష్టం చేశారు. రాష్ట్రాన్ని సైమైక్యంగా ఉంచాలని కోరుతూ ఇవాళ ఏపీ ఎన్జీఓతో పాటు సీమాంధ్రకు చెందిన విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటామని, రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలపై ప్రభుత్వ కమిటీ వేస్తామని సీమాంధ్ర ఉద్యోగులతో ప్రధాని చెప్పినట్లు సమాచారం.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.