నిరసనల నడుమ కొనసాగిన చర్చ

అడ్డంకుల నడుమ కొనసాగిన చర్చ


హైదరాబాద్, జనవరి 9 : వైఎస్సార్సీపీ సభ్యులు అడుగడుగునా కల్పించిన అడ్డంకులతో గురువారం కూడా శాసనసభలో ఆంధ్రవూపదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లుపై చర్చపై గందరగోళం కొనసాగింది. చివరకు వారిని ఒకరోజు సమావేశాలనుంచి సస్పెండ్ చేసి చర్చను కొనసాగించారు. ఉదయం ప్రారంభమైన సభ వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో 5 నిమిషాలకే వాయిదా పడింది. వైఎస్సార్సీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ ‘ ప్రతిరోజూ సభా సమయాన్ని వృధా చేయడం సరికాదు. ఇది పద్దతి కాదు’ అంటూ హెచ్చరించి సభను అరగంట వాయిదా వేశారు. 11.12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభలో వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. చర్చకు ముందే బిల్లుపై ఓటింగ్ జరపాలని వైఎస్సార్సీపీ కోరగా బిల్లుపై తీర్మానం చేయాలని టీడీపీలు పట్టుపట్టాయి.ASSEMBLY స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్చలోనే అన్ని అంశాలు ప్రస్తావించాలని సభ్యులను కోరారు. పోడియాన్ని చుట్టుముట్టి సమైక్యాంద్ర నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సభాపతి, విజయమ్మకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లుపై చర్చకు తాము వ్యతిరేకం కాదని వైఎస్సార్సీపీ సభ్యురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. సాంప్రదాయాలు, సభా గౌరవం లేకుండా ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత సభలో లేని సమయంలో బిల్లును సభలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టినపుడు తమ నేత సభలోనే ఉన్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వేరుబరి అనే ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో కలిపేందుకు అప్పటి రాష్ట్రపతి రాజేంవూదవూపసాద్ బిల్లును రాష్ట్రానికి పంపిస్తే సీఎం బీసీ రాయ్ దాన్ని అసెంబ్లీలో వ్యతిరేకించి సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ నిలుపుదల చేయించారన్నారు.

అందుకే ముందు బిల్లుపై తీర్మానం పెట్టాలని కోరాం, బిల్లుపై చర్చిస్తే ఇక తీర్మానం ఉండదని తాము భావిస్తున్నామని విజయమ్మ వెల్లడించారు. ఆర్ధిక శాఖ మంత్రి ఆనం జోక్యం చేసుకుని ఒక ప్రత్యేక పరిస్థితుల్లో నడుస్తున్న ఈ సమావేశాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొందని సందర్భానుసారం చర్చను కొనసాగిద్దామని సూచించారు. చర్చలో అభివూపాయాలు వ్యక్తం చేసి తదుపరి డిమాండ్లు చేద్దామంటూ పరోక్షంగా ఓటింగ్ ఉంటుందనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనికి టీఆర్‌ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పంపిన బిల్లుపై అభివూపాయాలు చెప్పాల్సిందిపోయి మంత్రులే తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డ టీఆర్‌ఎస్ సభ్యులు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుపట్టారు. అనంతరం విజయమ్మ వ్యాఖ్యలపై స్పందించేందుకు టీడీపీకి స్పీకర్ అవకాశం ఇచ్చారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సభలోనే ఉన్న చంద్రబాబును లేరని చెప్పడం సరికాదన్నారు. బిల్లును ఓడించాల్సిన బాధ్యత మనపై ఉంది…మాతో కలిసి రండి బిల్లును ఓడిద్దాం అంటూ వైసీపీ సభ్యులకు పిలుపునిచ్చారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. వైఎస్సార్సీపీ సభ్యులు మరోసారి స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని సభకు అవాంతరాలు సృష్టించారు. దీనితో 11.36 గంటలకు మరో అరగంట వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

వైఎస్సార్సీపీ సభ్యుల సస్పెన్షన్..
వాయిదా అనంతరం తిరిగి 12.20 గంటలకు ప్రారంభమైనా సభ్యులు యధావిధిగా తమ ఆందోళనలు కొనసాగించడంతో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్సార్సీపీ సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. సభ ఆమోదం తెలపడంతో 15 మంది వైఎస్సార్సీపీ సభ్యులను ఒకరోజుపాటు సభనుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సస్పెండ్ అయినవారిలో అమర్‌నాథ్‌డ్డి, సుచరిత, శోభానాగిడ్డి, ధర్మాన కృష్ణదాస్, వెంకవూటామిడ్డి, కె శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాస్‌డ్డి, భూమన కరుణాకర్‌డ్డి, పిన్నెల్లి లకా్ష్మడ్డి, గొర్ల బాబూరావు, బాల్‌రాజు, చంద్రశేఖర్‌డ్డి, గుర్నాధడ్డి, రమచంవూదాడ్డి, రామకృష్ణడ్డి, శ్రీకాంత్‌డ్డి తదితరులున్నారు. వారు సహకరించకపోవడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి సస్పెన్షన్‌కు గురైన సభ్యులను సభనుంచి బయటకు తరలించారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకూడా సభనుంచి వాకౌట్ చేశారు.

విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నాం: వట్టి
వైఎస్సార్సీపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం బిల్లుపై చర్చను కొనసాగించాలని స్పీకర్ కోరడంతో బుధవారం చర్చను ప్రారంభించిన మంత్రి వట్టి వసంతకుమార్ విభజనతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు..హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసేందుకు 50ఏళ్లు పట్టింది..విభజనతో సీమాంధ్ర 50 ఏళ్లు వెనుకబాటుకు గురవుతుందని వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికలను చదివి వినిపించారు. విభజనపై అసెంబ్లీ తీర్మానం లేకుండా ముందుకు వెళ్లడం సరికాదని, విదర్భ, ఉత్తర్ ప్రదేశ్ విభజనపై ఆయా రాష్ట్రాలు తీర్మానాలు చేసినా పట్టించుకోని కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు ఎందుకు తొందరపడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. సమాఖ్య స్పూర్తిని కేంద్రం అపహాస్యం చేసిందని, శాసనసభ తీర్మానం లేకుండా ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్న ఈ విభజనను తక్షణం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ సాంప్రదాయాలను పరిశీలించకుండా కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. ఏకీభావం సాధించడంలో కేంద్రం విఫలమైందన్నారు. బాబు, జగన్, తాను అందరం ఇందిరాగాంధీ వారసులమేనని, ఇందిర నాయకత్వంలోనే రాజకీయాల్లోకి వచ్చామని గుర్తుచేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.