హైదరాబాద్ : సడక్ బంద్ సందర్భంగా అక్రమ అరెస్టులపై తెలంగాణవాదులు తీవ్రంగా మండిపడ్డారు. అక్రమ అరెస్టులపై పది జిల్లాలు భగ్గుమన్నాయి. పది జిల్లాల వ్యాప్తంగా అక్రమ అరెస్టులపై తెలంగాణవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహాలను వినతి పత్రాలను సమర్పించారు. పలు చోట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదిలాబాద్‌లో సీఎంకు తెలంగాణవాదులు పిండప్రదానం చేశారు. సడక్ బంద్‌లో అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరిం
నిరసనలతో దద్ధరిల్లిన తెలంగాణ
Posted on March 22, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.