నిమ్స్‌లో దీక్ష చేస్తున్న బీజేపీ నేతలు

హైదరాబాద్ : నిమ్స్‌లో వైద్యపరిక్షలకు బీజేపీ నేతలు నిరాకరించారు. నిమ్స్‌లోనే దీక్ష కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, యెండెల లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేసి నిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.