నిబంధనలేమైనయి ఆంధ్రా మీడియా ఓనర్లారా

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్బీఏ నిబంధనలని.. పోలీసుల ఆంక్షలని  ఉద్యమాన్ని తొక్కిపెట్టిన ఆంధ్రా ఓనర్లు.. ఇప్పుడు  జరగని ఆందోళనలను అయినట్టు చూపిస్తున్నరు. తెలంగాణ ఉద్యమకారులపై పోలీసుల దాష్టీకాన్ని తొక్కిపెట్టి. ఇప్పుడు లేని ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్నరు. ఎన్టీవీ అయితే మరీ చిల్లర చేస్తున్నది. జీ 24గంటలు, టెన్ టీవీ అయితే అనంతపూర్ లో మొన్న జరిగిన ఆత్మహత్యా యత్నం విజువల్స్ ని చూపిస్తూ వైజాగ్ లో ఆత్మహత్యా యత్నమంటూ ప్రజలను తప్పుదోవపట్టించి సీమాంధ్ర ప్రజల్లో భావోద్వేగాలను రగిలించాలని యత్నించినయి.   ఎందుకు యెల్లో జర్నలిజం చేస్తరు. ఈటీవీ-2, టీవీ5,సాక్షి, టీవీ9, ఐన్యూస్, స్టూడియో ఎన్, మహాటీవీ, సీవీఆర్ చానళ్లు..  సీమాంధ్రలో మిన్నువిరిగి మీదపడినట్టు అక్కరకు రాని వార్తలను ప్రసారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నయి. అప్పుడెందుకు స్వీయనియంత్రణ విధించుకున్నరు. ఇప్పుడెందుకు బరితెగిస్తున్నరు. ప్రశాంతంగా ఉన్న సీమాంధ్ర ప్రజల్లో అలజడి ఎందుకు రేపుతరు. వాళ్లు రెచ్చిపోయి విధ్వంసాలకు పాల్పడేలా ఎందుకు చేస్తరు? మేము చిన్నరాయి వేస్తే కోతులన్నరు, కొండముచ్చులన్నరు.. ఇప్పుడు మరి సీమాంధ్రులను ఉద్యమకారులని అంటున్నరేంది?

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

3 Responses to నిబంధనలేమైనయి ఆంధ్రా మీడియా ఓనర్లారా

 1. raju says:

  exactly sir nenu ou lo mana valla meeda daadi ni record chesi teesukoste vaddu nba rules annaaru..kani ippudu continue ga vestunnaru. inko vishayam cheppali ikkada vizag lo maa sister ninna bds lo join ayyindi(vallani adigite asalu akkada alanti situation ledu mee media vallu chala over ga chupistunnaru ani annaru)

 2. shyam sundher reddy kyatam says:

  Ekkade manaku artham avuthundhi vallu chesedhi dhonga udyamam ani…manam mana tg lo simandra media ni ban cheyali….
  Jai telangaana….

 3. chandu says:

  em pikaleru ee vedavalanthaa … JAi telangana etti parsthi thulo telanagan hakkulanu pogottukokudadhu .