నితీశ్‌కు గుణపాఠం తప్పదు: మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రచార కమిటీ చీఫ్ నరేంవూదమోడీ బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. ఇటీవల బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తన బద్ధశవూతువు, బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. బీజేపీని మోసం చేసిన నితీశ్‌కుమార్‌కు బీహార్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రానున్న ఎన్నికల్లో ఆయనను ఓడిస్తారని జోస్యం చెప్పారు. ‘1974లోనూ ఇప్పటిలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయి.
అప్పట్లోలాగే బీహార్‌లో ప్రజాతీర్పును మోసగించిన వారికి గుణపాఠం తప్పదు. బీహార్ ప్రజల తీర్పు ఎన్డీయేకు అనుకూలంగా ఉండనుంది’ అని మోడీ.. నితీశ్ పేరు ప్రస్తావించకుండానే పేర్కొన్నారు. ఆడియో బ్రిడ్జ్ టెక్నాలజీ ద్వారా మోడీ శనివారం బీహార్ బీజేపీ నేతలతో ఫోన్‌లో ఏకకాలంలో మాట్లాడారు. మోడీతో మాట్లాడేందుకు మొత్తం 1500 మంది నేతలను గుర్తించి వారిని మూడు గ్రూపులుగా విభిజించారు. ప్రతి గ్రూప్‌లో ఐదుగురు నేతలతో మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగాబీజేపీ బీహార్ చీఫ్ మంగళ్‌పాండే మోడీతో మాట్లాడుతూ.. మీరు ప్రధాని అవుతారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నట్టు చెప్పారు. నవ్వుతూ ఆ మాటను తోసిపుచ్చిన మోడీ.. ధరల పెరుగుదలతోపాటు, కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర సర్కారును టార్గెట్ చేసేలా కార్యకర్తలు పనిచేయాలని హితబోధ చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.