నిజాం షుగర్స్ ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టొద్దు: హైకోర్టు

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ ప్రాంతానికి చెందిన నిజాం షుగర్స్ లిమిటెడ్‌ను ప్రైవేటీకరించే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర హైకోర్టు గురువారం రాష్ట్రవూపభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. సుమారు 80 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాంషుగర్స్ లిమిటెడ్‌ను డెల్టా పేపర్ మిల్స్ సంస్థ యాజమాన్యానికి కట్టబె వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్ 13న జారీచేసిన జీవో 5435పై హైకోర్టు సస్పెన్షన్ విధించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు ఎటువంటి చర్యలు చేపట్టవద్దని జస్టిస్ ఎల్ నర్సింహాడ్డి, జస్టిస్ చల్లా కోదండరామ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన చెరుకు రైతులు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.