నవీన్‌చారికి కన్నీటి వీడ్కోలు

mrgg – జగద్గిరిగుట్టలో అంత్యక్షికియలు
– పెద్దసంఖ్యలో హాజరైన తెలంగాణవాదులు
– కన్నీళ్లతో అమరుడికి నివాళులు
ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న నవీన్‌చారికి తెలంగాణవాదులు కన్నీటి వీడ్కోలు పలికారు. సమైక్య పార్టీల కుతంవూతాల వల్ల తెలంగాణ ఆగమైపోతున్నదన్న ఆవేదనతో ఆటోడ్రైవర్ అయిన నవీన్‌చారి ఆదివారం మాదాపూర్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో నడుస్తున్న రైలుకు ఎదురేగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన అంత్యక్షికియలు జగద్గిరిగుట్టలోని గుబురుగుట్ట శ్మశాన వాటికలో సోమవారం జరిగాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మరో బిడ్డ రాలిపోవడంతో తెలంగాణవాదులు కన్నీటిపర్యంతమయ్యారు. బోరున విలపిస్తూ నవీన్‌చారికి నివాళులర్పించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నవీన్‌చారి భౌతికకాయాన్ని తన నివాసానికి తరలించారు. దీంతో జగద్గిరిగుట్ట, శ్రీరాంనగర్‌లోని ఆయన నివాసానికి తెలంగాణవాదులు పెద్దఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు.

బోరున విలపిస్తున్న కుటుంబసభ్యులను సముదాయించేందుకు ప్రయత్నించారు. తెలంగాణ కళాకారులు తమ పాటలతో నవీన్‌చారికి నివాళులర్పించారు. శ్రీరాంనగర్ నుంచి గుబురుగుట్ట శ్మశాన వాటిక వరకు నవీన్‌చారి అంతిమయాత్ర కొనసాగింది. ఈ అంతిమయావూతలో పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు. నవీన్‌చారి భౌతికకాయానికి ఆయన కొడుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జై తెలంగాణ అని నినదించారు. అంతిమయావూతకు హాజరైన వారిలో జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, కుత్బుల్లాపూర్ జేఏసీ చైర్మన్ ఆస్కాని మారుతిసాగర్, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్, గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.